365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్,హైదరాబాద్, ఫిబ్రవరి 1, 2022 :తమ సుదీర్ఘకాలపు అనుబంధం కొనసాగిస్తూ బీహెచ్ఈఎల్ జీఈ గ్యాస్ టర్బైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (బీజీజీటీఎస్) మరో మారు ముందుకురావడంతో పాటుగా భారతదేశ వ్యాప్తంగా పౌష్టికాహార లోప సమస్యను తుదముట్టించాలనే అక్షయపాత్ర ఫౌండేషన్ లక్ష్యానికి మద్దతునందిస్తుంది.తెలంగాణా రాష్ట్రంలో కందిలోని అక్షయపాత్ర భారీ కిచెన్‌కు దాదాపు 40 లక్షల రూపాయలను తమ సీఎస్ఆర్లో భాగంగా బీజీజీటీఎస్ అందించింది. వీటి ద్వారా రెండు వాహనాలను కొనుగోలు చేశారు. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఈ వాహనాల ద్వారా తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని పాఠశాలలకు అక్షయపాత్ర చేరుకోవడంతో పాటుగా పౌష్టికాహార మధ్యాహ్న భోజనాలను అందించడం వీలవుతుంది. ఈ నూతన వాహనాలలో వేడి తగ్గని రీతిలో రూపొందించబడిన పాత్రలను తరలించడం సాధ్యం అవుతుంది.
తద్వారా దాదాపు 6వేల మంది విద్యార్థులకు ఆహారం అందించడమూ వీలవుతుంది.
ఈ నూతన వాహనాల కొనుగోలుకు మాత్రమే కాదు బీజీజీటీఎస్ ఇప్పుడు ఓ నూతన సాంబార్ కౌల్ర్డాన్ను నార్సింగిలోని అక్షయపాత్ర కిచెన్‌కు అందించింది. దీనిద్వారా అక్షయపాత్ర ఉత్పత్తి సామర్ధ్యం మెరుగుపడుతుంది. బీజీజీటీఎస్ నూతనవిరాళంతో కొనుగోలు చేసిన వాహనాలను అక్షయపాత్ర కంది కిచెన్ వద్ద బీజీజీటీఎస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ కె బీ రాజా,అతని బృంద సమక్షంలో జెండా ఊపి ప్రారంభించారు.
బీజీజీటీఎస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కెబీ రాజా మాట్లాడుతూ ‘‘దేశవ్యాప్తంగా ఇక ఎంత మాత్రమూ చిన్నారులు పౌష్టికాహార లోపం, ఆకలితో బాధపడకూడదని కోరుకుంటున్నాము. అక్షయపాత్రతో మా భాగస్వామ్యం ఈ సమస్యను అంతమొందిం చాలనే మా నిబద్ధతకు ప్రతిరూపంగా నిలుస్తుంది. తెలంగాణాలోని కమ్యూనిటీల కోసం విద్య,పౌష్టికాహారం మెరుగుపరచాలనే అక్షయపాత్ర లక్ష్యంలో భాగం కావడం పట్ల మేము సంతోషంగా ఉన్నాము’’ అని అన్నారు.అక్షయపాత్ర ఫౌండేషన్ సీఎంఓ సందీప్ తల్వార్ మాట్లాడుతూ ‘‘చిన్నారులను పాఠశాలలకు తీసుకురావడంతో
పాటుగా పౌష్టికాహారం అందించడం ద్వారా వారు మరింత మెరుగ్గా జీవనం గడిపేలా తోడ్పడాలనే లక్ష్యం ఈ తరహా భాగస్వామ్యాల ద్వారా మాత్రమే చేరుకోగలం. బీజీజీటీఎస్ అందించిన రెండు నూతన వాహనాలతో పాటుగా సాంబార్ కౌల్ర్డాన్తో అక్షయ పాత్ర మరింత మంది విద్యార్థులను చేరుకోవడం సాధ్యమవుతుంది’’ అని అన్నారు.