Thu. Nov 21st, 2024

365తెలుగుడాట్ కామ్ లైన్ న్యూస్,హైదరాబాద్‌, ఫిబ్రవరి 8, 2022 : క్యాంపస్‌ల కోసం భారతదేశంలో ఎక్కువ మంది అభిమానించే వ్యాపార క్విజ్‌ టాటా క్రూసిబల్‌ క్యాంపస్‌ క్విజ్‌ మరో మారు తమ 18వ ఎడిషన్‌తో ముందుకువచ్చింది. విజయవంతమైన తమ డిజిటల్‌ వెర్షన్‌ను కొనసాగిస్తూ ఈ క్విజ్‌ ఆన్‌లైన్‌లో ఈ సంవత్సరం సైతం జరుగనుంది. ఈ క్విజ్‌ కోసం రిజిస్ట్రేషన్లు ఫిబ్రవరి7న ప్రారంభమయ్యాయి. ఇవి మార్చి7 వరకూ కొనసాగుతాయి. ఈ క్యాంపస్‌క్విజ్‌ ఆన్‌లైన్‌ వెర్షన్‌లో భాగంగా దేశాన్ని 24 క్లస్టర్‌లుగా విభజించారు.

రెండు దశల్లో ఆన్‌లైన్‌ ప్రిలిమ్స్‌ పూర్తయిన తరువాత ప్రతి క్లస్టర్‌ నుంచి అగ్రస్ధానంలో నిలిచిన 12 మందిని వైల్డ్‌కార్డ్‌ ఫైనల్స్‌కు ఆహ్వానిస్తారు. వీరి నుంచి ఆరుగురు ఫైనలిస్ట్‌లను 24 ఆన్‌లైన్‌ క్లస్టర్‌ ఫైనల్స్‌లో పోటీపడేందుకు ఆహ్వానిస్తారు. అనంతరం ఈ 24 క్లస్టర్లను తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ అంటూ నాలుగు జోన్లగా విభజిస్తారు. ఈ క్లస్టర్‌లలో విజేతలు జోనల్‌ ఫైనల్స్‌కు ఎంపిక అవుతారు. ఇక్కడ విజేతలకు 35వేల రూపాయలు, ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి 18 వేల రూపాయల బహుమతులు అందిస్తారు.

ఈ నాలుగు జోన్స్‌ ఫైనల్స్‌లో విజేతలు నేరుగా జాతీయ ఫైనల్స్‌లో పోటీపడతారు. అలాగే ఈ నాలుగు జోన్లలో రన్నర్లు వైల్డ్‌ కార్డ్‌ ఫైనల్‌ కోసం తిరిగి పోటీపడతారు. వీరి నుంచి గెలుపొందిన ఇద్దరు జాతీయ ఫైనల్స్‌కు ఎంపికవుతారు. జాతీయ ఫైనల్స్‌లో విజేతలు 2.5 లక్షల రూపాయల బహుమతితో పాటుగా ప్రతిష్టాత్మకమైన టాటా క్రూసిబల్‌ ట్రోఫీ అందుకుంటారు. ఈ క్విజ్‌ గురించి టాటా సన్స్‌ కార్పోరేట్‌ బ్రాండ్‌ అండ్‌ మార్కెటింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అడ్రియన్‌ టెర్రాన్‌ మాట్లాడుతూ ‘‘అత్యంత వేగంగా మారుతున్న ప్రపంచంలో వ్యక్తులు పోటీపడాలంటే అంతర్జాతీయ పోటీ అవసరం. ఈ క్విజ్‌ ద్వారా భావితరాన్ని భవిష్యత్‌కు సిద్ధంగా మలుస్తున్నాము’’ అని అన్నారు.ఈ క్విజ్‌కు క్విజ్‌మాస్టర్‌గా గిరి బాలసుబ్రమణియం వ్యవహరిస్తుండగా, టాటా క్లిక్‌ బహుమతులను అందజేస్తుంది. మరిన్ని వివరములు తెలుసుకునేందుకు, నమోదు చేసుకునేందుకు www.tatacrucible.com చూడవచ్చు.

error: Content is protected !!