
365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,ఇండియా,9 ఫిబ్రవరి,2022 : ప్రత్యేకమైన ప్రేమికుల దినోత్సవాన ప్రేమ పండుగను వేడుక చేసుకోవడానికి సమయం ఆసన్నమైంది. మీ ప్రేమను వ్యక్తీకరించడానికి మీ మధురస్మృతులలోనికి తీసుకువెళ్లే ఫోటో ఆల్బమ్,కస్టమైజ్డ్ సిమ్‌కార్డును బహుమతిగా అందించడానికి మించిన ఉత్తమమైన మార్గమేముంది ? సుప్రసిద్ధ టెలికామ్ బ్రాండ్, వి మీ ప్రేమికుల దినోత్సవాన్ని మరింత ప్రత్యేకంగా, మరుపురానిదిగా మలుస్తూ జూమిన్ భాగస్వామ్యంతో ఓ ప్రత్యేక ఆఫర్‌ను తీసుకువచ్చింది.
మీ ప్రియమైన వారికి కస్టమైజ్డ్ మొబైల్ నెంబర్– అది పుట్టినరోజు, వార్షికోత్సవ తేదీ లేదా మరేదైనా ప్రత్యేక సిరీస్‌తో తీర్చిదిద్దిన – వి పోస్ట్ పెయిడ్ సిమ్ కార్డ్‌ను బహుమతిగా అందించండి,జూమిన్ నుంచి 299 రూపాయల విలువ కలిగిన కస్టమైజ్డ్ ఫోటోబుక్‌ను ఉచితంగా పొందండి. జూమిన్‌తో వి భాగస్వామ్యం కారణంగా మీ అత్యుత్తమ చిత్రాలను ఎంపిక చేసుకోవడం మాత్రమే కాదు, మీ భాగస్వామిని ప్రత్యేకంగా తీర్చిదిద్దిన 20 పేజీల ఫోటోబుక్‌తో మధురస్మృతులలోనికి తీసుకువెళ్లండి. ఈ ఆఫర్ 09 ఫిబ్రవరి నుంచి 14 ఫిబ్రవరి 2022 వరకూ అందుబాటులో ఉంటుంది.

ఈ ఆఫర్‌ను అందుకోవడం కోసం https://www.myvi.in/new-connection/buy-postpaid-sim-connection-online?utm_source=Valentine సందర్శించండి.