365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ముంబై, ఫిబ్రవరి3,2022 : ఫిబ్రవరి 10న విడుదల కానున్న తమిళ్‌ యాక్షన్‌-థ్రిల్లర్ మహాన్‌ ట్రైలర్‌ను ప్రైమ్‌ వీడియో నేడు విడుదల చేసింది. కార్తిక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొంది సెవెన్‌ స్క్రీమ్‌ స్టూడియో బ్యానర్‌పై లలిత్‌ కుమార్‌ నిర్మించిన యాక్షన్‌భరిత చిత్రంలో అద్భుతమైన తారాగణం ఉంది. ప్రధానపాత్రలో విక్రమ్‌ నటించగా ఇతర కీలక పాత్రల్లో ధ్రువ్‌ విక్రమ్‌, బాబీ సింహా, సిమ్రన్‌ నటించారు. తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లో మహాన్‌ చిత్రాన్ని ప్రేక్షకులు తిలకించవచ్చు.

కన్నడలో ఈ చిత్ర టైటిల్‌మహా పురుష. వేగంగా సాగే ఈ ట్రైలర్‌ మనకు వ్యక్తిగత సంక్షోభంలో చిక్కుకున్న ఒక సాధారణ వ్యక్తి కథను తెలియజెప్తుంది. కుటుంబం తనను వదిలి వెళ్లడం, సిద్ధాంతాలకు కట్టుబడి సూటిగా సాగే జీవిత లక్ష్మణ రేఖను దాటడాన్ని చూపిస్తుంది. వారు లేకుండానే తన లక్ష్యాలు సాధించేందుకు ముందుకు సాగుతాడు. కాని, విజయ శిఖరానికి చేరిన సమయంలో తన కొడుకు తన చెంత లేడనే విషయాన్ని గ్రహిస్తాడు. అతను తన జీవితంలోకి తిరిగి రావాలని కోరుకుంటాడు. ఆ తర్వాత అంతా ఊహించని మలుపులు, ఒడిదొడుకులు, మనుగడ కోసం తనను తాను మార్చుకోవడం వంటివి యాక్షన్‌తో నిండిన కథనం ఆసాంతం.

చిత్ర దర్శకుడు కార్తిక్‌ సుబ్బరాజ్‌ మాట్లాడుతూ, ‘ప్రతిభావంతులైన కళాకారులు, సిబ్బంది అందించిన సహకారంతో రూపొందించిన మహాన్‌ నా శ్రమకు ఫలితం. విక్రమ్‌తో పనిచేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంటుంది. ఆయన అద్భుతమైన కెరీర్‌లో మహాన్‌ 60వ చిత్రం కాబట్టి ఇది మరింత ప్రత్యేకమైనది. తండ్రి కొడుకు
విక్రమ్‌, ధ్రువ్‌ ఇద్దరిని మొదటిసారి తెరపై చూపే అవకాశం నాకు ఈ చిత్రం అందించింది. వారిని చూసి ప్రేక్షకులు, అభిమానులు ఆనందిస్తారని నేను నమ్ముతున్నాను. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ద్వారా మహాన్‌ ప్రపంచవ్యాప్తంగా
ఉన్న ప్రేక్షకుల ముందుకు రావడం కోసం నేను ఎదురుచూస్తున్నాను” అన్నారు.

ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ప్రముఖ నటుడు విక్రమ్‌ మాట్లాడుతూ, “యాక్షన్‌, డ్రామా అద్భుతమైన మేళవింపు, సమపాళ్లలో భావోద్వేగాలతో తీర్చిదిద్దిన మహాన్‌ చిత్రం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. నా చిత్రంలోని నా పాత్రకు అనేక ఛాయలు ఉన్నాయి. కథ ముందుకు సాగుతున్న కొద్ది ఒ‍క భావోద్వేగం నుంచి మరో దానికి మారుతుండటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నా సినీ ప్రయాణంలో ఇది 60వ చిత్రం కావడంతో ఇది ఒక మైలురాయి, అలాగే ఈ చిత్రంలో నా కుమారుడు ధ్రువ్‌ విక్రమ్ తెరపై కూడా కొడుకుగా నటించడంతో ఈ చిత్రం నాకు మరింత ప్రత్యేకంగా నిలుస్తోంది. తన పాత్ర కోసం అతను ఎంతో శ్రమించాడు. నాకు చాలా గర్వంగా ఉంది. తుది ఫలితం ఎలా ఉండాలో స్పష్టంగా తెలిసిన ప్రతిభాశాలి కార్తిక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో పనిచేయడం నిజంగా ఆనందాన్నిస్తుంది. ప్రైమ్‌ వీడియో ద్వారా మహాన్‌ ఫిబ్రవరి 10న ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల ముందుకు
వస్తుండటం నాకు సంతోషంగా ఉంది.”

ధ్రువ్‌ విక్రమ్‌ మాట్లాడుతూ, “మహాన్‌ చిత్రం నాకు ఎంతో ప్రత్యేకమైనది, మొదటిసారి నాన్నతో కలిసి స్క్రీన్‌ స్పేస్‌షేర్ చేసుకుంటున్నాను అది కూడా కొడుకు పాత్రలో. నాన్న ఎంతో ప్రతిభాశాలి, కళను ఆయన ఎంతో అద్భుతంగా అర్థం చేసుకుంటారు, ఆయన నుంచి నేను నేర్చుకునేది ఎంతో ఉంది. కార్తిక్‌ సుబ్బరాజు సర్‌ దర్శకత్వంలో పనిచేయడం నిజంగా ఒక గొప్ప అనుభవం. ఈ చిత్రం ద్వారా ఆయన నాకు ఎన్నో నేర్పించారు, నా పాత్ర సూక్ష్మ నైపుణ్యాలు, దాని తీవ్రతను లోతుగా అర్థం చేసుకోవడంలో ఆయన ఎంతో సాయపడ్డారు. ఇది నాలోని ఉత్తమ
ప్రతిభను వెలికి తీసిందని నమ్ముతున్నాను. ఈ నటనను, ఈ సినిమాను ప్రేక్షకులు హాయిగా ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల ముందుకు మహాన్‌ను తీసుకువస్తున్నందుకు ప్రైమ్‌ వీడియోకు ధన్యవాదాలు. ఈ చిత్రం విడుదల కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అన్నారు

మహాన్‌ చిత్రంలో కీలక పాత్రధారి సిమ్రన్‌ మాట్లాడుతూ, “విక్రమ్‌, కార్తిక్‌తో కలిసి మహాన్‌ కోసం మరోసారి పనిచేయడం ఒక అద్భుతమైన అనుభవం. యాక్షన్‌తో నిండిన ఈ చిత్ర కథలో ఎమోషన్స్‌, డ్రామా పెనువేసుకు ఉన్నాయి. ఈ చిత్రంలో నా పాత్ర పేరు నాచి, మామూలు గృహిణి పాత్ర ఇది. ప్రేమించే చిన్న కుటుంబంతో హాయిగా సాగుతున్న ఆమె జీవితం ఆమె భర్త సైద్ధాంతిక మార్గాన్ని వీడినప్పుడు ఎలా గతి తప్పుకుందో చూపుతుంది. అద్భుతమైన కథనంతో కూడిన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రైమ్‌ వీడియో ప్రేక్షకులు ఆదరిస్తారని నేను
నమ్ముతున్నాను” అన్నారు.“హద్దులు చెరిపేస్తూ మీరు పని చేస్తున్న తీరు నన్ను ఎంతో ఆనందానికి గురిచేస్తోంది.

ప్రైమ్‌ వీడియో ద్వారా మహాన్‌ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడం నాకు సంతోషాన్ని ఇస్తోంది. యాక్షన్‌ దృశ్యాలు, అద్భుతమైన కథ, కథనంతో ప్రేక్షకులను మహాన్‌ ఆకట్టుకుందని నేను ఎంతో నమ్మకంతో ఉన్నాను” అన్నారు నటుడు బాబీ
సింహా. టూకీగా: మామూలు ఉద్యోగం చేసుకుంటూ భార్య, కొడుకుతో కూడిన ఒక చిన్న కుటుంబం కలిగిన ఒక సాధారణ మనిషి కథ మహాన్‌. అతను సాధారణ జీవితం గడుపుతూ ఉంటాడు. ఎప్పుడూ హద్దులు దాటడు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమం వరకు అతను రోజువారీ పనులు నడుస్తుంటాయి. ఒకరోజు అనుకోకుండా అతను తన హద్దు దాటి అవతలికి వచ్చినప్పుడు బాల్యమిత్రుడిని కలుసుకుంటాడు. ఆ క్రమంలో కోటిశ్వరుడు అయి రాజులా జీవిస్తాడు. కాని, నిత్యం తన కొడుకును చూడలేకపోతున్నాననే బాధ వెంటాడుతూ ఉంటుంది. కాని, ఒకరోజు
అనుకోకుండా ఒక అనూహ్యమైన పరిస్థితిలో కొడుకు అతన్ని కలుసుకుంటాడు.

ఆ తర్వాత ఏం జరుగుతుందనేది అద్భుతమైన థ్రిల్లింగ్‌, యాక్షన్‌తో నిండి ఉంటుంది. ప్రైమ్‌ వీడియో క్యాటలాగ్‌లో ఉన్న వేలాది హాలీవుడ్‌, బాలీవుడ్‌ చిత్రాలు, టీవీ షోల సరసన మహాన్‌ చేరనుంది. ఇందులో ఇండియాలో నిర్మించిన అమెజాన్‌ ఒరిజినల్‌ సీరిస్‌ ముంబయి డైరీస్‌, ది ఫ్యామిలీ మ్యాన్‌, కామికిస్తాన్‌ సెమ్మా కామెడీ పా, బ్రీథ్‌: ఇంటూ ది షాడోస్‌, బందిష్‌ బాండిట్స్‌, పాతాళ్‌ లోక్‌, తాండవ్‌,
మీర్జాపూర్‌ సీజన్‌ 1 & 2, ది ఫర్‌గాటెన్‌ ఆర్మీ- ఆజాదీ కే లియే, సన్స్‌ ఆఫ్‌ ది సాయిల్‌: జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌, ఫోర్‌ మోర్‌ షాట్స్‌ ప్లీజ్‌, , మేడిన్‌ ఇన్‌ హెవెన్‌, ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ వంటివి ఉన్నాయి. అలాగే భారతీయ చిత్రాలు కూలీ నెం.1, గులాబో సీతాబో, దుర్గామతి, ఛలాంగ్‌, శకుంతలా దేవి, జై భీమ్‌, పొన్మగల్‌ వందల్‌, ఫ్రెంచ్‌
బిరియాని, లా, సూఫీయుం సుజాతయుం, పెంగ్విన్‌, నిశ్శబ్ధం, మారా, వి, సీ యూ సూన్‌, సూరారై పొట్రు, భీమసేన నలమహారాజా, దృశ్యం 2, హాలాల్‌ లవ్‌స్టోరీ, మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌, పుదం పుదు కాలాయ్‌, అన్‌పాజ్డ్‌.

అవార్డులు గెల్చుకొని అంతర్జాతీయంగా విమర్శకుల ప్రశంసలు పొందిన అమెజాన్‌ ఒరిజినల్స్‌ బొరాట్‌ సబ్‌సీక్వెంట్‌ మూవీ ఫిల్మ్‌, ది వీల్‌ ఆఫ్‌ టైమ్‌, టామ్‌ క్లాన్సీ నటించిన జాక్‌ రేయాన్‌, ది బాయ్స్‌, హంటర్స్‌, ఫ్లీబ్యాగ్‌, ది మార్వెలెస్‌ మిసెస్‌ మిషల్‌ వంటివి ఉన్నాయి. ఇవన్నీ ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యులు చూడవచ్చు. ఇందులో హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళ్‌, తెలుగు, కన్నడ,మలయాళం, పంజాబీ, బెంగాలీ భాషల చిత్రాలు కూడా ఉన్నాయి.


ప్రైమ్‌ సభ్యులు మహాన్‌ చిత్రాన్ని ప్రైమ్‌ వీడియో ఆప్‌ ద్వారా స్మార్ట్‌ టీవీలు, మొబైల్‌ డివైసులు, ఫైర్‌ టీవీ, ఫైర్‌ టీవీ స్టిక్‌, ఫైర్‌ ట్యాబ్లెట్లు, యాపిల్‌ టీవీ మొదలైన వాటిల్లో ఎప్పుడైనా, ఎక్కడైనా చూడవచ్చు. ప్రైమ్‌ వీడియో యాప్‌లో ప్రైమ్‌ సభ్యులు ఎపిసోడ్లు డౌన్‌లోడ్‌ చేసుకొని తమ మొబైల్స్‌, ట్యాబ్లెట్లలో ఎటువంటి
అదనపు ఖర్చు లేకుండా ఎక్కడైనా ఆఫ్‌లైన్‌లోనూ చూడవచ్చు. ₹1499 వార్షిక రుసుము లేదా నెల ₹179తో ప్రైమ్‌ మెంబర్‌షిప్‌తో పాటు ప్రైమ్ వీడియో పొందవచ్చు. కొత్త కస్టమర్లు మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ww.amazon.in/prime సందర్శించి 30 రోజుల ఫ్రీ ట్రయల్‌ కోసం సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి.