Thu. Dec 12th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్‌, మార్చి3,2022: తెలంగాణా, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న టెక్స్‌టైల్‌ హబ్స్‌ అత్యంత వేగంగా ఎంఎస్‌ఎంఈలలో మార్పులను చవిచూడ టంతో పాటుగా తమ వ్యాపారాలను మరింత వేగవంతం చేయడానికి సాంకేతిక వేదికలను స్వీకరిస్తున్నాయి. పూర్తిస్థాయి బీ2బీ ట్రేడ్‌ ఎనేబల్‌మెంట్‌ వేదిక బిజాంగో తమ వార్షిక ఆదాయం పరంగా 20 రెట్ల వృద్ధిని నమోదు చేయడంతో పాటుగా గత 11 నెలల కాలంలో ఈ ప్రాంతాలలో 600 కోట్ల రూపాయలను నమోదు చేసింది.

ఒక్క కర్నాటక రాష్ట్రమే భారతదేశంలో వస్త్ర ఉత్పత్తి పరంగా 14%కు తోడ్పాటునం దిస్తుంది. ఆ రాష్ట్ర రాజధాని బెంగళూరు ఇప్పుడు భారతదేశపు గార్మెంట్‌ క్యాపిటల్‌గా వెలుగొందుతుంది. ఇక్కడ అత్యధిక సంఖ్యలో ఫ్యాబ్రిక్‌,యార్న్‌ తయారీదారులు ఉన్నారు.ఈ వృద్ధిలో అత్యధిక శాతం తయారీదారుల ఋణ,వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలను తీర్చడానికి అందించబడిన డిజిటైజ్డ్‌,ఆటోమేటెడ్‌ సరఫరా చైన్‌ ఫైనాన్సింగ్‌ పరిష్కారాలు తోడ్పడుతున్నాయి.గణనీయంగా వృద్ధి చెందిన పత్తి ధరలు, బొగ్గు కొరత వంటివి మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్లను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాయి.
ఎంఎస్‌ఎంఈలు తమ ఉత్పత్తిని సరిగా నిర్వహించేందుకు ఋణాలు తీసుకునేలా పురికొల్పాయి.

బిజాంగో ఈ ఎంఎస్‌ఎంఈలకు తనఖా లేని,కనీస డాక్యుమెంటేషన్‌తో వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలను తీర్చింది. బిజాంగో, భాగస్వామ్య కేంద్ర వేదిక, మాన్యువల్‌ టాస్క్స్‌ను తొలగించడం ద్వారా వస్త్రతయారీదారులకు ఉత్పత్తి ప్రణాళిక, ఆర్డర్‌ డెలివరీ టైమ్‌లైన్స్‌, పేమెంట్‌ రీకాన్సిలేషన్‌కు తోడ్పడింది. ఐఓటీ ఆధారిత క్లౌడ్‌ ఫ్యాక్టరీ ఏర్పాట్లను సైతం బిజాంగో ప్రారంభించడం ద్వారా ఎంఎస్‌ఎంఈలు తమ ఎంటర్‌ప్రైజ్‌ వినియోగదారులకు రియల్‌ టైమ్‌ అప్‌డేట్స్‌ను తమ ఉత్పత్తులు, ఆర్డర్ల స్ధితి పరంగా అందించడంతో పాటుగా ఇన్వాయిస్‌లు సృష్టించడం
,కలెక్షన్స్‌ను చేపట్టడంలో సమయం, శ్రమను సైతం తగ్గిస్తుంది.

బిజాంగో సరఫరా చైన్‌ ఫైనాన్స్‌ మోడల్‌ను ఉచిత నగదు ప్రవాహ నమూనాలో తీర్చిదిద్దారు. ఇది వేగవంతంగా వర్కింగ్‌ క్యాపిటల్‌ను అందిస్తుంది. తద్వారా తయారీదారులు తమ పనితీరు మెరుగుపరుచుకోగలరు. ఈ విధానమే సాంకేతికంగా అగ్రగామి సంస్ధను మార్కెట్‌ లీడర్‌గా అనుకూలీకరణ ఉత్పత్తుల విభాగాలైనటువంటి
టెక్స్‌టైల్స్‌, అప్పెరల్స్‌, ఇతర కాంట్రాక్ట్‌ తయారీ ఉత్పత్తులలో నిలిపింది.బిజాంగో కో–ఫౌండర్‌ , సీఓఓ అనికేత్‌ దేబ్‌ మాట్లాడుతూ ‘‘మా వేదిక వ్యాపార వినియోగదారులు మొదలు గార్మెంట్‌ తయారీదారులు వరకూ, అంతేకాదు యార్న్‌ సరఫరాదారులు ,ఆఖరకు కాటన్‌ మిల్‌ వరకూ మొత్తం టెక్స్‌టైల్‌ తయారీ వ్యవస్థకు తోడ్పడే రీతిలో ఉంటుంది.

మా సాంకేతిక వేదికతో మేము అమ్మకాలు,సేకరణ పరంగా అదనపు విలువను జోడిస్తున్నాము. అది ఆర్డర్లను డిజిటలైజ్‌ చేయడం, డెలివరీలు లేదా క్రెడిట్‌కు
ఇన్వాయిసింగ్‌ చేయడం ఏదైనా సరే బిజాంగో ఇప్పుడు టెక్స్‌టైల్‌ జీవిత కాలంలో కీలకమైన ప్రతి ఒక్కరికీ తమ వ్యాపారాలను అత్యంత సమర్థవంతమైన మార్గంలో నిర్వహించేందుకు, తమ వనరులను ఆప్టిమైజ్‌ చేసెందుకు తోడ్పడుతుంది’’ అని అన్నారు. బిజాంగోకు 25కు పైగా ఆర్ధిక సంస్థలతో శక్తివంతమైన భాగస్వామ్యం ఉంది. వీటి ద్వారా ఎంఎస్‌ఎంఈల ఋణ,వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలను తీరుస్తుంది. ఈ ఎంటర్‌ప్రైజ్‌ వినియోగదారులలో హవర్స్‌ ఓవర్‌సీస్‌,త్రిపాల్‌ ట్రేడర్స్‌, నమో ట్రేడర్స్‌ వంటివి ఉన్నాయి.

నమో ట్రేడర్స్‌ యజమాని అనుపమ్‌ చౌదరి మాట్లాడుతూ ‘‘మా అమ్మకాలు 45%కు పైగా వృద్ధి చెందాయి. డిమాండ్‌ ఉన్నప్పటికీ మేము మా వినియోగదారులకు తగినసమయంలో సరఫరా చేయడం పరంగా తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నాము. దీనికి ప్రధానకారణం వర్కింగ్‌ క్యాపిటల్‌ తగినంతగా లేకపోవడం. బిజాంగో మాకు ఈ అవరోధాలను అధిగమించడంలో సహాయపడటంతో పాటుగా మా వ్యాపారం స్ధిరంగా వృద్ధి చెందేందుకు సహాయపడింది. వర్కింగ్‌ క్యాపిటల్‌ చుట్టూ ఉన్న సమస్యలను అధిగమించడంలో ఇది మాకు ఎంతగానో తోడ్పడింది’’ అని అన్నారు.2021లో ఈ సాంకేతిక వేదిక 1200 కోట్ల రూపాయలను తమ సరఫరా చైన్‌ ఫైనాన్సింగ్‌ ద్వారా అందించింది. అత్యధిక యాజమాన్య నిర్వహణ ఖర్చులు (టీసీఓ), తయారీ ప్రక్రియలు, ఆఫ్‌లైన్‌ క్యాటలాగ్‌, ఆర్ట్‌వర్క్‌ మేనేజ్‌మెంట్‌, తాత్కాలికంగా విక్రేతలతో బంధం, సరైన రీతిలో లేని కొనుగోలు ప్రణాళికలు, అత్యధిక ఇన్వెంటరీ,అమ్మకాలలో నష్టాలు, వెండార్‌ భాగస్వాములకు చెల్లింపులు ఆలస్యం కావడం వంటి వాటి నుంచి ఎదురవుతున్న సవాళ్ల కారణంగా డిజిటల్‌ వేదికలకు డిమాండ్‌ గణనీయంగా ఏర్పడింది.

error: Content is protected !!