Thu. Nov 7th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా ,మార్చి 14,2022: ఇండియాలోని చెన్నైలో గ్లోబల్‌ ఇంజినీరింగ్‌ సెంటర్‌ (జీఈసీ) ప్రారంభించినట్టు
డబ్య్లూపీపీ నేడు ప్రకటించింది. హుషారైన సృజనాత్మక ప్రతిభతో కూడిన నైపుణ్యాలు, పరిశ్రమలో అగ్రశ్రేణి సాంకేతికతతో కూడిన ఈ జీఈసీ, డబ్ల్యూపీపీ అంతర్జాతీయ సేవలను మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
చెన్నైలో జీఈసీ ఏర్పాటు అన్నది డబ్ల్యూపీపీ పరివర్తన ప్రయాణంలో కీలకమైన మైలురాయిగా నిలవనుంది. అంతే కాదు భారీ స్థాయి వృద్ధికి కీలక మార్కెట్‌గా భారత్‌ పట్ల ఉన్న నిబద్ధతను చాటి చెప్తుంది.భారతదేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో డబ్ల్యూపీపీ ఆఫీసులు ఉన్నా విస్తృతంగా అభ్యర్థులు అందుబాటులో ఉండటం, బలమైన ఐటీ సామర్ధ్యాలు ఉన్న ప్రదేశం కావడంతో వ్యూహాత్మకంగా చెన్నై నగరాన్ని ఎంచుకోవడం జరిగింది.

ప్రారంభోత్సవం సందర్భంగా డబ్ల్యూపీపీ సీఈఓ మార్క్‌ రీడ్‌ మాట్లాడుతూ, “మహమ్మారి కారణంగా వ్యాపార నిర్వహణలో సమూలమైన మార్పులు చోటుచేసు కున్నాయి. గతంతో పోల్చితే ఇప్పుడు ప్రగతికి ప్రధాన మెట్టుగా టెక్నాలజీ నిలుస్తోంది. గతం కంటే మెరుగ్గా మనం మళ్లీ నిలదొక్కుకునేందుకు ఎంతో
సాయపడుతోంది. భారతదేశంలో ఉనికి పెంచుకునేందుకు డబ్ల్యూపీపీ వాస్తవిక పెట్టుబడులు పెట్టింది. స్థానికంగా ఉన్న అత్యంత నైపుణ్యం కలిగిన ప్రతిభావం తులను సృజనాత్మక పరిశ్రమల్లోనే కాదు సాంకేతిక పరిశ్రమలోనూ నియమించు కోవడంపై మరింత దృష్టి సారించింది.

మా సాంకేతిక సేవలను మరింత అభివృద్ధిపరచడంలో చెన్నైలోని మా కొత్త డబ్ల్యూపీపీ సహచరులు కీలక భూమిక పోషిస్తారు. భారీస్థాయిలో సానుకూల మార్పులు సృష్టించగల శక్తి ఉన్న పరిశ్రమలో సహచరులతో కలిసి పనిచేయడం ఒక ప్రత్యేక
అవకాశంగా మేము భావిస్తున్నాం. దీని గురించి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను” అన్నారు. సీవీఎల్‌ శ్రీనివాస్, కంట్రీ మేనేజర్‌ ఇండియా డబ్ల్యూపీపీ, మాట్లాడుతూ “డబ్ల్యూపీపీ పరివర్తనలో ఇప్పటికే భారత్‌ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రవంచవ్యాప్తంగా ఉన్న గ్లోబల్‌ టెక్నాలజీ సీఓఈల్లో 4000లకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రతిభా కేంద్రాలకు ఈ జీఈసీ మరో చేరిక అవుతుంది. మా అంతర్జాతీయ కంపెనీ తన టెక్నాలజీని మరింత విస్తరించేందుకు ఇది సాయపడుతుంది. చెన్నైలో మా సహచరులకు స్వాగతం పలికేందుకు మేము ఉత్సాహంగా ఉన్నాం” అన్నారు.

డబ్ల్యూపీపీ చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ రాచెల్‌ హిగమ్‌ మాట్లాడుతూ, “చెన్నైలో మా కొత్త జీఈసీ ప్రారంభం, సృజనాత్మక పరివర్తన రంగంలోనే కాకుండా ఐటీ రంగంలో కూడా నాయకులుగా మా స్థానాన్ని మరింత వేగవంతం చేసే సామర్థ్యం కలుగుతుండటం నాకు చాలా సంతోషం కలిగిస్తోంది. మా ప్రజల కోసం మెరుగైన భవిష్యత్తు నిర్మించాలనే మా ఉద్దేశాలకు తోడ్పాటు కోసం మేము వారి వ్యక్తిగత, వృత్తిపరమైన
పురోగతిలో పెట్టుబడి పెట్టేందుకు కట్టుబడి ఉన్నాము, వారు కోరుకునే విధంగా మాతో వారి కెరీర్‌ పెరిగేలా చూడటమే కాకుండా వారిని ఉత్తమ స్థానంలో ఉంచుతాము. మాతో చేరడం ద్వారా వారు అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేసి మద్దతు అందించే బృందంలో భాగమవుతారు.

వారు ఈ రంగంలో అగ్రగాములుగా నిలిచేందుకు వారికి ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తాం” అన్నారు. రానున్న ఎనిమిది నెలల కాలంలో కొత్త జీఈసీ కోసం శ్వాశత ఆఫీసు నెలకొల్పడం, ప్రారంభ దశలో దశలో 200లకు పైగా ఐటీ నిపుణులను నియమించుకునే ప్రణాళికను డబ్ల్యూపీపీ కొనసాగిస్తుంది. వీరు ఫ్లాట్‌ఫామ్‌ సర్వీసులు, క్లౌడ్‌, నెట్‌వర్క్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇంజినీరింగ్ సహ కీలక ఉత్పత్తుల కార్యకలాపాలు, సైబర్‌ సెక్యూరిటీ వంటి అనేక రంగాల్లో సపోర్టుగా నిలుస్తారు. ఈ క్రమంలో మనందరికి మెరుగైన భవిష్యత్‌ నిర్మించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సృజనాత్మక సహచరులతో కలిసి పనిచేసే అవకాశం వారికి లభిస్తుంది.

error: Content is protected !!