Mon. Dec 23rd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూఢిల్లీ, ఏప్రిల్ 28, 2022: డెపిలేటరి ఉత్పత్తులలో (అనవసరమైన కేశాలను నిర్మూలించటానికి ఉపయోగించబడే ఉత్పత్తులు) ప్రపంచ నాయకునిగా ఉన్న వీట్ తమ కొత్త కాంపైన్ ని బ్రాండ్ అంబాసిడర్ కత్రినా కైఫ్ తో ఆరంభించింది. ఈ కాంపైన్ ఆధునిక, వివిధ బాధ్యతలు కలిగిన నేటి యువతుల అవసరాల్ని వీట్ వారి కోల్డ్ వ్యాక్స్ స్ట్రిప్స్ ,తో తీర్చడం పై దృష్టి కేంద్రీకరించింది.ప్రసిద్ధి చెందిన ఫిల్మ్ దర్శకులు పునీత్ మల్హోత్ర దర్శకత్వం లో రూపొందిన ఈ కాంపైన్ ‘ద బెటర్ వే టు వ్యాక్స్’ తీవ్రమైన ఎండాకాలం నెలల్లో ప్రభావవంతంగా జుట్టు ని నిర్మూలించే పరిష్కారాల్ని వేగంగా కోరుకునే మహిళలకు ఎంతో సహాయపడుతుంది.

ఉపయోగించడానికి సులభంగా ఉండటం,ఇంట్లో గొప్ప ఫలితాల్ని ఇవ్వటం వలన వీట్ గోల్డ్ వ్యాక్స్ స్ట్రిప్స్ అతి వేగంగా ప్రసిద్ధి చెందాయి. అత్యంత సాధారణమైన వేడి షుగర్ వ్యాక్సింగ్ కంటే కోల్డ్ వ్యాక్సింగ్ మెరుగైన ఫలితాల్ని ఇస్తుంది, ఇంకా ఎన్నో పనులలో నిమగ్నమైన మహిళలకు అసౌకర్యం, మరీ ముఖ్యంగా సమయం లేకపోవడం, గందరగోళం వంటివి లేకుండా, రాజీపడని ఫలితాలతో త్వరగా జుట్టుని నిర్మూలించడాన్ని కోరుకునే మహిళలకు ఇది అనుకూలమైనది.
కాంపైన్ గురించి మాట్లాడుతూ, శ్రీ డైలెన్ గాంధీ, ప్రాంతీయ మార్కెటింగ్ డైరక్టర్, దక్షిణ ఆసియా- హెల్త్ & న్యూట్రిషన్, రెకిట్ ఇలా అన్నారు, “నేటి పలు బాధ్యతలు నిర్వహించే మహిళలు కొత్త, రాజీలేని ఫలితాలతో సులభంగా ఉపయోగించగలిగే పరిష్కారాలతో తమ జీవితాన్ని సులభం చేసుకోవడానికి అన్వేషిస్తారని మేము అర్థం చేసుకున్నాం.

మా కొత్త కాంపైన్ #TheBetterWayToWax ని కత్రినా కైఫ్ తో ఆరంభించడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నాము. తమ జీవితంలో కోరుకునేది మరియు స్టైల్,ఆత్మవిశ్వాసంతో దానిని సాధించే మహిళలకు ఆమె ప్రతీకగా నిలుస్తుంది,ప్రేరేపిస్తుంది. రాజీపడని,తాము చేసే ప్రతి పనిలో ఉత్తమదనం కోరుకునే మహిళల్ని ఈ కాంపైన్ ద్వారా మేము గౌరవిస్తున్నాం. గొప్ప ఫలితాలతో జుట్టుని తొలగించడానికి సౌకర్యవంతమైన,ప్రభావవంతమైన విధానాన్ని అందిస్తున్న వీట్ కోల్డ్ వ్యాక్స్ స్ట్రిప్స్ ఒక పరిపూర్ణమైన పరిష్కారం.”ఆరంభోత్సవం పై వ్యాఖ్యానిస్తూ, నటీమణి,ఔత్సాహికురాలు , కత్రినా కైఫ్ ఇలా అన్నారు, “పలు బాధ్యతల్ని నిర్వహిస్తూ, తమ శిక్షణా అవసరాలు కోసం సౌకర్యవంతమైన,ప్రభావవంతమైన పరిష్కారం కోసం అన్వేషించే నా వంటి మహిళలకు ఉదాహరణగా నిలిచే వీట్ అనేది ఒక దిగ్గజ బ్రాండ్.

వీట్ తో నాకు గల దీర్ఘకాల ప్రయాణం మా సంబంధాన్ని మరింత
ప్రత్యేకం చేసింది, కొత్త కాంపైన్ #TheBetterWayToWax కోసం నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను,ప్రేక్షకులు కూడా ఇష్టపడతారని ఆశిస్తున్నాను.”పునీత్ మల్హోత్ర, డైరక్టర్, రచయిత,ప్రకటనల దర్శకుడు ఇలా అన్నారు, “స్వీయ-వ్యక్తీకరణని సంబరం చేసి ,తమ జుట్టుని తొలగించే ప్రయాణంలో మగ ,ఆడవారికి కూడా కొత్త పరిష్కారాలు అందచేసే నేను వీట్ తో భాగస్వామం చెందినందుకు
ఆనందంగా ఉన్నాను. #TheBetterWayToWax తో, మేము కత్రినా ,సహజమైన సరదా స్వభావాన్ని వెల్లడించాము,ఆమె తన రోజూవారీ జీవితంలో వివిధ బాధ్యతల్ని ఎలా నిర్వహిస్తోందో ప్రేక్షకులకు చూపించాము.

ఈ ప్రకటనకి దర్శకత్వంవహించడానికి,వీట్ తో చేసే ప్రయాణంలో భాగంగా ఉండటానికి నేను వ్యక్తిగతంగా ఎంతో ఇష్టపడ్డాను”
బాబీ పవార్, ఛైర్మన్,ఛీఫ్ క్రియేటివ్ అధికారి, హవాస్ గ్రూప్ ఇండియా ఇలా అన్నారు, “నేటి మహిళ చాలా బాధ్యతల్ని వహించడమే కాకుండా వాటిల్లో వారు ప్రతిభ చూపిస్తున్న విషయం ఆధారంగా కూడా కాంపైన్ రూపొందించబడింది.వారి జీవితాలలో అనుభవం ఎంత ఎక్కువగా ఉందో వారికి సమయం అంత తక్కువగా ఉన్నా కూడా తమ తీరికలేని జీవితాల్లో నిరంతరంగా ఇమిడిపోతున్న మహిళలకు వారు జీవించే విధంగా వారికి శ్రేష్టతని ఇవ్వడానికి వీట్ ఒక పరిపూర్ణమైన సంక్షేమ భాగస్వామి.”నటి, ఔత్సాహికురాలు,ఫిట్ నెస్ ఉత్సుకత కలిగిన కత్రినా కైఫ్ నేటి ఆధునిక మహిళకు పరిపూర్ణమైన ఉదాహరణగా నిలుస్తుంది.

సెలబ్రిటీగా నుండి ఔత్సాహికురాలు వరకు ఆమె ప్రయాణం ఆమె వీట్ కి పరిపూర్ణంగా సరిపోతుందని నిర్థారించే ఒక శక్తివంతమైన ఉదాహరణ.
ఇంట్లో ప్రభావవంతమైన,సమర్థవంతమైన ఫలితాల్ని అందించే , ఉపయోగించడానికి సులభమైన వీట్ కోల్డ్ వ్యాక్స్ స్ట్రిప్స్ ఉత్పత్తిని స్థిరపరిచే లక్ష్యంగా#TheBetterWayToWax అనేది డిటిల్,టెలివిజన్ లలో బహు విధాలుగా కస్టమర్లని చేరుకునే 360 డిగ్రీ మార్కెటింగ్ కాంపైన్. ఈ వ్యాక్స్ స్ట్రిప్స్ 28 రోజులు వరకు మృదుత్వాన్ని ఇస్తాయి ,దానికి గల కూల్ జెల్ వ్యాక్స్ టెక్నాలజీ వలన అతి చిన్న జుట్టు ని కూడా తొలగించగలదు.వీట్ కోల్డ్ వ్యాక్స్ స్ట్రిప్స్ భారదేశంలో రీటైల్ స్టోర్స్ ,వెబ్ సైట్స్ లో ఐఎన్ఆర్ 99కి ఆరంభమయ్యే ధరలో లభిస్తున్నాయి.

టీవీసీ లింక్:  https://www.youtube.com/watch?v=KckETRcMIG0
దర్శకుడు: పునీత్ మల్హోత్ర
ప్రొడక్షన్ హౌస్: ఎఫ్ఏఆర్ కమర్షియల్
క్రియేటివ్ ఏజెన్సీ: హవాస్ వరల్డ్ వైడ్ మీడియా
నిర్మాత: జీత్ సురేంద్రనాథ్, రోహిణి పింటో & సోనికా మోడీ

error: Content is protected !!