Mon. Dec 23rd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, 12 మే 2022: వండర్‌లా హాలిడేస్ హైదరాబాద్, ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతి, +1,+2 బోర్డు పరీక్షలకు హాజరైన విద్యార్థులకు ఈ నెల 21-22 తేదీలలో ఎంట్రీ టిక్కెట్లపై ప్రత్యేక తగ్గింపు ఆఫర్‌ను తిరిగి అందుబాటులోకి తీసుకు వచ్చింది. విద్యార్థులు 35% తగ్గింపుతో హైదరాబాద్ పార్క్ ఎంట్రీని పొందవచ్చు,వారు తమ ఒరిజినల్ ఎగ్జామినేషన్
హాల్ టిక్కెట్లను వండర్‌లా కౌంటర్లలో చూపించడం ద్వారా ఈ తగ్గింపును పొందవచ్చు. మే 14,2022 నుంచి భారతదేశం వ్యాప్తంగా ఉన్న ఉన్న 10వ తరగతి, +1,+2 విద్యార్థులకు ఈ రాయితీ ధర అందుబాటులో ఉంటుంది.

భౌతిక దూరంతో కూడిన ప్రోటోకాల్‌లను అనుసరించి వండర్‌లా తన సందర్శకు లను, తమ ఆన్‌లైన్ పోర్టల్ https://bookings.wonderla.com/ ద్వారా ముందుగానే ఎంట్రీ టిక్కెట్లను బుక్ చేసుకోమని ప్రోత్సహిస్తుంది లేదా వినియోగదారులు నేరుగా పార్క్ కౌంటర్‌ల నుంచి కూడా టిక్కెట్లను కొనుగోలు చేసుకోవచ్చు. పార్కులో ప్రవేశానికి ముందుగా ఒరిజినల్ హాల్ టికెట్‌ను పరిశీలిస్తారు. వండర్‌లా హైదరాబాద్ పార్కు ఇప్పుడు అన్ని రోజులు తెరిచే ఉంటుంది. మరింత సమాచారం కోసం
 www.wonderla.comని సందర్శించండి లేదా 08414676300, 08414676333కు కాల్ చేయండి.

error: Content is protected !!