
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,తిరుమల, 2022 మే 31:శ్రీవారి అనుగ్రహంతో సృష్టిలోని సకల జీవరాశులు సుభిక్షంగా ఉండాలని కోరుతూ టిటిడి ప్రారంభించిన మహాభారతం ప్రవచనాల్లో భాగంగా నాదనీరాజనం వేదికపై రేపటి నుంచి సభాపర్వం ప్రవచనం ప్రారంభం కానుంది. ప్రస్తుతం జరుగుతున్న ఆదిపర్వం ప్రవచనం ఈరోజుతో ముగియనుంది. ఈ ప్రవచనాల్లో పండితులు ప్రతి శ్లోకానికి అర్థతాత్ప ర్యాలను వివరిస్తారు. ఈ కార్యక్రమం ఎస్వీబీసీలో రాత్రి 8 నుంచి 9 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం కానున్నది