365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి, జూన్13, 2022: ప్రముఖ హీరోయిన్ పాయల్ రాజ్ ఫుత్ తిరుపతిలో సందడి చేసింది. తిరుపతి- బెంగళూరు జాతీయ రహదారిలోని రామానుజపల్లి వద్ద హోటల్ ద్వారకా ఇన్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైంది. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి హోటల్ ను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉందని పాయల్ రాజ్ ఫుత్ తెలిపారు.
సక్సెస్ అనేది మన సొంతం అయితే మనమే ఆ సక్సెస్ కు నిర్వచనం అవుతామని అన్నారు. హోటల్ సక్సెస్ ఫుల్ గా రన్ అవాలని కోరుకున్నట్లు తెలిపారు.. త్వరలో నాలుగు సినిమాలు విడుదల కానున్నాయని, అందులో రెండు పాన్ ఇండియా సినిమాలని చెప్పారు.. నిరంతరాయంగా ఆరు నుంచి ఏడు సినిమాల్లో నటించడంతో చాలా బిజీగా ఉన్నానని అన్నారు. జయరాజ్ బయోపిక్ లోనూ నటిస్తున్నట్లు పాయల్ రాజపుత్ వెల్లడించారు.