![hanumanthavahanam](http://365telugu.com/wp-content/uploads/2022/06/hanumanthavahanam.jpg)
365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్, తిరుపతి, జూన్ 16,2022: అప్పలాయ గుంట శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగు తున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజైన బుధవారం హనుమంత వాహనంపై కోదండరాముని అలంకారంలో స్వామివారు దర్శమిచ్చారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది.
![hanumanthavahanam](http://365telugu.com/wp-content/uploads/2022/06/hanumanthavahanam.jpg)
హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడిగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధిచెందాడు. గురుశిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచనగావించిన మహనీయులు కనుక వీరిని దర్శించిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది. మధ్యాహ్నం 3నుంచి 4 గంటల వరకు పుణ్యాహవచనం, వసంతోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు గజ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శన మివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో కంకణబట్టార్ సూర్యకుమార్ ఆచార్యులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.