365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,జూన్ 30, 2022: డా.కే లక్ష్మణ్ రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై హైదరాబాద్ విచ్చేస్తున్న సందర్భంగా రాజేంద్రనగర్ నియోజకవర్గం బీజేపీ సీనియర్ నాయకుడు బుక్క వేణుగోపాల్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీలో ప్రతిఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని బుక్క వేణుగోపాల్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “మన తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న బీజేపీజాతీయ కార్యవర్గ సమావేశాలకు ముందు రోజు జూలై 1వ తేదీన మధ్యాహ్నం 2:15 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హైదరాబాద్ విచ్చేస్తున్న సందర్భంగా రాజ్యసభ సభ్యులు, ఓబిసి జాతీయ అధ్యక్షులు డా.కే.లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ లు పాల్గొననున్నారు.
శంషాబాద్ ట్రిడెంట్ హాస్పిటల్ నుంచి గచ్చిబౌలి వరకు.. జరిగే ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరూ మద్దతుగా పాల్గొని ఐక్యత చాటి ర్యాలీనీ విజయవంతం చేయాలని కోరుతున్నాను”అని బుక్క వేణుగోపాల్ అన్నారు.