smiti-irani
smiti-irani

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,జూలై 5,2022: ఎనిమిది సంవత్స రాలలో సాధించిన విజయాలు’- మహిళలు, పిల్లలపై ప్రభావం అనే అంశంపై జోనల్ సమావేశాన్ని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఈ రోజు హైదరాబాద్ లో ప్రారంభించారు. ఈ సమీక్షా సమావేశంలో తెలంగాణ గిరిజన సంక్షేమం, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా పాల్గొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోని ‘బేటీ బచో బేటీ పఢావో’, ‘పీఎం కేర్స్‌’, ‘సఖి వన్‌స్టాప్‌ సెంటర్లు’, ‘పీఎం మాతృత్వ వందన యోజన’, ‘పోషణ్‌ అభియాన్‌’ వంటి పథకాల లబ్ధిదారులు ఈ సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

smiti-irani

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో విధానాలను అమలు చేసినప్పుడు మహిళల జీవితాల్లో సానుకూలమైన మార్పు తీసుకురాగలమని లబ్ధిదారులు పంచుకున్న అనుభవాల ద్వారా అవగతమవుతుందని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. తెలంగాణకు 36 వన్ స్టాప్ సెంటర్లు (ఓఎస్సీ) మంజూరయ్యాయని, వాటిలో 33 ఇప్పటికే పనిచేస్తున్నాయని, అవసరమైతే ఓఎస్సీల సంఖ్యను పెంచాలని రాష్ట్రం నుంచి వచ్చిన తాజా ప్రతిపాదనలను ఆమె స్వాగతించారు. 2015 లో ప్రారంభించిన వన్ స్టాప్ సెంటర్స్ పథకం వైద్య సహాయం, న్యాయ సహాయం, మానసిక సలహా మరియు తాత్కాలిక ఆశ్రయం పరంగా లింగ ఆధారిత హింసను ఎదుర్కొంటున్న మహిళలకు సహాయాన్ని అందిస్తుంది. గృహహింస వల్ల జరిగిన గాయాన్ని అధిగమించి ప్రస్తుతం ఒక చిన్న కిరాణా దుకాణాన్ని నడుపుతూ ఆర్థికంగా స్వతంత్రంగా ఎదిగిన తన అనుభవాన్ని పంచుకున్న సఖి ఓఎస్సి లబ్ధిదారు ధైర్యాన్ని స్మృతి ఇరానీ ప్రశంసించారు.

smiti-irani

కోవిడ్ మహమ్మారి కారణంగా అనాథలైన పిల్లలను గుర్తించేందు కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శిశు సంక్షేమ కమిటీల ద్వారా తీవ్ర ప్రయత్నం జరిగిందని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తెలిపారు. ఫలితంగా దాదాపు 4000 మంది పిల్లలకు ‘పీఎం కేర్స్‌’ కింద ఆర్థిక సహాయం అందించడం జరిగిందని మంత్రి తెలిపారు. వివిధ పథకాల సహాయంతో కష్టాలను అధిగమించే వారి కధలను పంచుకున్న లబ్ధిదారుల సంకల్పాన్ని, సానుకూలతను మంత్రి ప్రశంసించారు సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై) పథకం కింద ఇప్పటివరకు 2.7 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచినట్లు, వాటిలో ఇప్పటివరకు లక్ష కోట్ల రూపాయలకు పైగా జమ చేసినట్లు శ్రీమతి స్మృతి ఇరానీ తెలిపారు. ఎస్ ఎస్ ఎ కింద 19000 కి పైగా గ్రామాలు పూర్తిగా సంతృప్తమయ్యాయని, ఇది మహిళా సాధికారత పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని ఆమె అన్నారు.

smiti-irani

రాష్ట్రంలో మహిళా సాధికారత, శిశు ఆరోగ్య సూచీల మెరుగుదల విషయంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త కృషి సత్ఫలితాలను ఇస్తోందని తెలంగాణ గిరిజన సంక్షేమం, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అభిప్రాయపడ్డారు. మహిళలు, పిల్లల కేంద్రీకృత పథకాలలో గత ఎనిమిది సంవత్సరాలలో సాధించిన విజయాలు, ప్రణాళికాబద్ధమైన నూతన కార్యక్రమాలను గురించిన వివరాలను కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఇండెవర్ పాండే, అదనపు కార్యదర్శిలు సమర్పించారు. అంతకు ముందు తెలంగాణ ప్రభుత్వ మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్ రాష్ట్ర పురోగతి గురించి ఒక పీపీపీ సమర్పించారు. గౌరవనీయ ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కిషన్ రావు కరాడ్,డబ్ల్యుసిడి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజ్ పారా మహేంద్రభాయ్ సభికులను ఉద్దేశించి ప్రసంగించారు.