Mon. Dec 23rd, 2024
Balkampeta Ellamma Ammavari Kalyanam

https://www.youtube.com/shorts/uB9AUvU_9nQ

Balkampeta Ellamma Ammavari Kalyanam

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ ,జులై 5,2022: బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం మంగళవారం కన్నుల పండుగగా, అత్యంత ఘనంగా జరిగింది. ఆలయం ముందు నిర్మించి న భారీ షెడ్డు క్రింద వేదపండి తుల మంత్రోచ్ఛారణలతో అమ్మవారి కల్యాణం నిర్వహించారు.

https://www.youtube.com/shorts/uB9AUvU_9nQ

అమ్మవారి కళ్యాణాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుండి భక్త్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు.ఆలయ పరిసరాలు మొత్తం జనసంద్రంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు.

Balkampeta Ellamma Ammavari Kalyanam

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ దంపతులు అమ్మవారి కల్యాణం లో పాల్గొన్న అనంతరం ఆలయం లోపల అమ్మవారిని దర్శించు కొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పండితులు వేద మంత్రాల తో ఆశీర్వచనం చేసి ప్రసాదాలు అందజేశారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీ క్యూ లైన్ లలో నిల్చున్నారు.

https://www.youtube.com/shorts/uB9AUvU_9nQ

ఆలయం పక్కన నూతనంగా నిర్మించిన షెడ్డులో కూడా భక్తులు కూర్చొని అమ్మవారి కళ్యాణాన్ని వీక్షించారు. భక్తులు అమ్మవారి కళ్యాణాన్ని వీక్షించే లా LED స్క్రీన్ లను కూడా ఏర్పాటు చేశారు. అమ్మవారి కళ్యాణంలో TSMIDC చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మేయర్ విజయలక్ష్మి,డిప్యూటీ మేయర్ .

https://www.youtube.com/shorts/uB9AUvU_9nQ

Balkampeta Ellamma Ammavari Kalyanam

శ్రీలత, MP కవిత, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ TRS ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ దంపతులు, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, కార్పొరేటర్ లు మహేశ్వరి, సరళ, మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, అత్తిలి అరుణ గౌడ్, EO అన్నపూర్ణ, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

https://www.youtube.com/shorts/uB9AUvU_9nQ

error: Content is protected !!