365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, జూలై 14,2022: ఇండియా క్యూజిన్లలో విస్తృతమైన రేంజి ఫ్లేవర్లతో కూడిన గ్రిల్డ్ ఫుడ్స్‌కు అత్యుత్తమ మైన బార్బిక్యూ హాలిక్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇక్కడ నోరూరించే రకరకాల స్టార్టర్లు, రుచికరమైన ప్రాంతీయ వంటకాలతో పాటు, టేస్టీ ఫుడ్స్ ఉంటాయి. నిపుణులైన షెఫ్‌ల బృందం వివిధ ప్రాంతాలకు చెందిన వంటకాలను రూపొందిస్తారు. 150మంది కూర్చునేలా అద్భుతంగా డిజైన్ చేసిన బార్బిక్యూ హాలిక్‌లో భారతదేశంలోనే ప్రధాన క్యుజిన్లు అన్నింటి నుంచి ఎంపిక చేసిన తాజా స్టార్టర్లు ఉన్నాయి. మాక్‌టెయిల్స్ అన్ని వయసుల వినియోగదారుల మూడ్‌ను తప్పనిసరిగా మళ్లీ తీసుకొస్తాయి.
ఈ సందర్భంగా బార్బిక్యూ హాలిక్ ప్రమోటర్లు శ్రీలక్ష్మి, మౌనికలు మాట్లాడుతూ..“సాదరంగా ఆతిథ్యమిచ్చే “బార్బిక్యూ హోలిక్’ అందించే ఇంటీరియర్స్, రుచికరమైన వంటకాలు కచ్చితంగా అతిథులకు ఉత్తమ భోజన అనుభవాన్ని ఇస్తాయి. ఇక్కడ అత్యుత్తమ కబాబ్‌లే కాకుండా, అత్యంత విస్తృతమైన ప్రధాన కోర్సు, ప్రత్యేకంగా రూపొందించిన డెజర్ట్‌లను కూడా ఆస్వాదించగలరని హామీ ఇస్తున్నాము. బార్బిక్యూ హాలిక్‌లో , బఫే అందించడం కేవలం ఒక బాధ్యత మాత్రమే కాదు, ఈ అనుభవం అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను అందిస్తుంది” అని చెప్పారు.