Tue. Dec 17th, 2024
Samsung foldable smartphone

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జూలై 29,2022: ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ నెక్స్ట్ జనరేషన్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను ఆగష్టు10వ తేదీన ఆవిష్కరించ నున్నట్లు వెల్లడించింది. తమ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీతో తయారుచేసిన పరికరాలను అందించ డంలో శాంసంగ్ ముందువరుసలోనే ఉంటుంది.

Samsung foldable smartphone

నేటితరం యువతను దృష్టిలో ఉంచుకొని అత్యంత నాణ్యమైన, మెరుగైన సాంకేతికతతో పలు రకాల ఫీచర్స్ ను పరిచయంచేస్తోంది శాంసంగ్. ఎన్నడూలేని విధంగా ప్రస్తుత 5జీ తరానికి కావాల్సిన అవసరాలను గుర్తిస్తూ, తగిన మార్పులు చేర్పులు చేస్తూ సరికొత్త టెక్నాలజీని అందిస్తోంది ఈ స్మార్ట్ ఫోన్ల దిగ్గజం.

Samsung foldable smartphone

శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ భారతదేశంలో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను ఆగష్టు10వ తేదీన ఆవిష్కరించ నున్నది. ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆగస్టు 10వతేదీ సాయంత్రం 6:30లకు శాంసంగ్ న్యూస్‌రూమ్‌ లో లైవ్ టెలికాస్ట్ చేయనున్నారు. కార్యక్రమాన్ని లైఫ్ లో వీక్షించడానికి Samsung Newsroom ను క్లిక్ చేయండి.

error: Content is protected !!