Tue. Dec 24th, 2024
Megha Krishna Reddy is partner of KCR, alleges YS Sharmila

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,వికారాబాద్,ఆగష్టు 11,2022:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, మేఘా కృష్ణా రెడ్డిలపై వైఎస్సార్‌సీపీ వ్యవస్థాపకురాలు వైఎస్‌ షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు.

వికారాబాద్‌ దుద్యాల గ్రామంలో జరిగిన మాటా ముచ్చట కార్యక్రమంలో వైఎస్‌ షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు. సభను ఉద్దేశించి వైఎస్ షర్మిల మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను సీఎం కేసీఆర్ మేఘా కృష్ణా రెడ్డికి అప్పగించారని ఆరోపించారు.

   Megha Krishna Reddy is partner of KCR, alleges YS Sharmila

సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం, మిషన్‌ భగీరథ, పాలమూరు-రంగారెడ్డితో పాటు మేజర్‌ నుంచి మైనర్‌ ప్రాజెక్టులను మేఘాకృష్ణారెడ్డికి కేటాయించారని అన్నారు. కేసీఆర్ కు కృష్ణా రెడ్డి భాగస్వామి అని, కృష్ణా రెడ్డి నుంచి కేసీఆర్ కుటుంబానికి కమీషన్లు వస్తాయని ఆమె అన్నారు. బాసర ఐఐఐటీలో నాణ్యత లేని ఆహారాన్ని అందజేస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఆమె మండిపడ్డారు.

error: Content is protected !!