365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఆగష్టు 11,2022: కానిస్టేబుల్ పోస్టుల ప్రిలిమినరీ రాత పరీక్ష ఆగస్టు 28వతేదీకి వాయిదా వేసినట్లు తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించింది. ఆగస్టు 21న పరీక్ష జరగాల్సి ఉండగా సాంకేతిక సమస్యల కారణంగా తేదీని మార్చినట్లు తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది.
ఎస్‌ఐ పోస్టులకు ఆగస్టు 7న రాత పరీక్ష నిర్వహించగా.. తెలంగాణ రాష్ట్రంలో 554 ఎస్‌ఐ పోస్టులు, 15,644 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 25న నోటిఫికేషన్ వెలువడింది. అలాగే 614 ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుళ్ల పోస్టులకు ఏప్రిల్ 28న నోటిఫికేషన్ విడుదలైంది. కానిస్టేబుల్ పోస్టులకు 9.50 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.హైదరాబాద్ సహా 40 నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.