365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఆగష్టు12,2022: తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ నాగార్జున సాగర్ వద్ద బుద్ధవనంను ఏర్పాటు చేసిన విషయం తేలిసిందే. స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా బుద్ధవనం-బౌద్ధ వారసత్వ థీమ్ పార్క్‌లోకి సందర్శకులకు ఉచిత ప్రవేశానికి అనుమతిస్తున్నారు. బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుద్ధవనంలోకి సందర్శకులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
బుద్ధవనంలో ఉన్న ప్రత్యేకతలను అడిగి తెలుసుకోవచ్చని ఆయన వెల్లడించారు. పర్యాటకులు ఆగస్టు15న బుద్ధవనంలోని వివిధ విభాగాలను ఉచితంగా సందర్శించే అవకాశం ఉంటుందని లక్ష్మయ్య పేర్కొన్నారు. నాగార్జున సాగర్ హిల్‌కాలనీలో 274 ఎకరాల్లో బుద్ధవనం నిర్మించాలని గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 2005లో నాటి పర్యాటక శాఖ అధికారులు బుద్ధవనం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 2006లో బౌద్ధ మత గురువు దలైలామా అమరావతిలో కాలచక్ర యాగానికి వెళుతూ ఇక్కడ బోధి వృక్షాన్ని నాటారు.