Six-students-goes-missing-i

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇబ్రహీంపట్నం,ఆగస్టు 19,2022: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్‌లో శుక్రవారం స్నానానికి వెళ్లి ఆరుగురు విద్యార్థులు గల్లంతైన విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కొండపల్లి కాలనీకి చెందిన విద్యార్థులు ఈరోజు స్నానానికి వెళ్లారు.

నీటిలోకి దిగిన విద్యార్థులు వరద ప్రవాహానికి కొట్టుకుపోయారు. అయితే అక్కడే ఉన్న ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది వెంటనే స్పందించి ఐదుగురు విద్యార్థులను రక్షించి, మరొకరి కోసం గాలింపు చేపట్టారు.