365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, న్యూయార్క్,ఆగస్టు 22,2022: భారతదేశం 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని న్యూయార్క్ నగరంలో వార్షిక ఇండియా డే పరేడ్ నిర్వహించారు. ఆదివారం జరిగిన ఈ కవాతులో తెలుగు మెగాస్టార్ అల్లు అర్జున్ గ్రాండ్ మార్షల్‌గా ఉన్నారు.దీనికి 150,000 మంది హాజరయ్యారు. మాడిసన్ అవెన్యూలోని మార్గం పొడవునా కవాతు నిర్వహించారు.
వేడుకలు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (FIA) ట్రై-స్టేట్ ఏరియా యూనిట్ ఈ పరేడ్ కు సంబంధించి రెండు ఈవెంట్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కెక్కాయి. అత్యధిక సంఖ్యలో జెండాలు ఏకకాలంలో ఎగురవేసిన కార్యక్రమంతోపాటు, డమ్రుకం, డ్రమ్స్ తోకూడిన అతిపెద్ద సమూహం చేపట్టిన కార్యక్రమంగా చరిత్ర సృష్టించారు. ఈ రికార్డులను గ్లోబల్ ఇండియన్ కమ్యూనిటీకి అంకితం ఇస్తున్నట్లు ఎఫ్ఐఏ చైర్మన్ అంకుర్ వైద్య తెలిపారు.
జెండాల ప్రదర్శన, ఈ సంవత్సరం తిరంగా, భారతీయ జెండాను గౌరవించే థీమ్‌కు అనుగుణంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల జెండాలను కూడా చేర్చడం ద్వారా భారతదేశ ఘనతను విశ్వవ్యాప్తంగా ప్రదర్శించింది. కవాతుకు నాయకత్వం వహించిన వారిలో న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ భారత జెండాను పట్టుకుని ఉన్నారు.
గాయకుడు కైలాష్ ఖేర్ “హిందుస్థాన్ మేరీ జాన్” సామూహిక గానానికి నాయకత్వం వహించారు. భారతీయ సంస్థలు అలాగే డంకిన్ డోనట్స్ వంటి అమెరికన్ వ్యాపారాలు ESPN హులు వంటి వినోద సంస్థల నుంచి నలభైకి పైగా పాల్గొన్నాయి.