Mon. Dec 23rd, 2024
crime

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఆగస్టు22,2022: ఓ వ్యక్తి కోర్టులో ఆవరణలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం కూకట్‌పల్లి కోర్టులో చోటు చేసుకుంది. కోర్టు ఆవరణలోనే వ్యక్తి మణికట్టు కోసుకోవడంతో ఈ ఘటన కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మియాపూర్‌లోని IX మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కూకట్‌పల్లి కోర్టు ఆవరణలోని అడ్వకేట్ హాల్‌లోకి వెళ్లి బ్లేడ్‌తో వ్యక్తి మణికట్టు కోసుకున్నాడు. ఇది గమనించిన న్యాయవాదులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించి ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి ప్రమాదకరంగా ఉందని పోలీసులు తెలిపారు. విచారణ కొనసాగుతోంది.

error: Content is protected !!