Megastar Chiranjeevi Birthday Celebrations Photos Leaked...

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,ఆగష్టు 23,2022: మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సెల్రేషన్స్ ఫొటోస్ లీక్..అయ్యాయి..ప్రతిఏటా చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా తన ఇట్లోనే వేడుకలు జరుపుకునేవారు.. ఈ సారి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి గ్రాండ్ గా సెలబ్రట్ చేసుకున్నారు.

Megastar Chiranjeevi Birthday Celebrations Photos Leaked...

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తనకు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

తన జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమానులు రక్తదానం చేయడం, ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం తన మనసును తాకిందని పేర్కొన్నారు. అంతేకాదు,తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి నగరానికి దూరంగా వెళ్లి వేడుకలు జరుపుకున్నానని చిరంజీవి వెల్లడించారు.

కుటుంబ సభ్యులతో గడిపిన ఆ క్షణాలు అద్భుతమని వివరించారు. ఈ మేరకు ఫొటోలను కూడా పంచుకున్నారు.