365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆంధ్రప్రదేశ్,ఆగష్టు 23,2022: ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల, కృష్ణా జిల్లాల్లో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.

బాపట్ల జిల్లా జె పంగులూరు మండలం కొండ మంజులూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ నాయకుడు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళితే చంద్రగిరి నుంచి చిలకలూరిపేట వైపు టీడీపీ నాయకులు వెళ్తున్న కారు మార్గమధ్యలో లారీని ఢీకొనడంతో చంద్రగిరి మండల టీడీపీ యూత్ అధ్యక్షుడు భాను ప్రకాష్(31) మృతి చెందాడు.
తిరుపతి జిల్లా టీడీపీ కార్యదర్శి గంగుపల్లి భాస్కర్ గాయపడ్డారు. కృష్ణా జిల్లా గన్నవరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై వెనుక నుంచి లారీ కారు ఢీకొనడంతో ఏపీ జెన్‌కో ఉద్యోగి వర ప్రసాద్ భార్య మృతి చెందింది.

మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.05:51 PM