365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,ఆగష్టు 26,2022:భార్యను గొడ్డలితో నరికి చంపి, ఆపై తానూ ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాలలో గురువారం చోటుచేసుకుంది. ఉదయం వీరిద్దరి మధ్య జరిగిన గొడవ ఈ విషాద ఘటనకు దారి తీసింది.
ఈ గొడవలో ఆవేశానికి లోనైన సంజీవ్ (28) తన భార్య రమ్య (26)ని నరికి చంపాడని సమాచారం.ఇంట్లో రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో ఉన్న సంజీవ్‌ను ఇరుగుపొరుగు వారు ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
గాంధారి మండలం సర్వాపూర్‌కు చెందిన రమ్యకు తాడ్వాయి మండలం చిట్యాలకు చెందిన సంజీవ్‌తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వారిద్దరికీ మూడేళ్ల కూతురు ఉంది. హత్యకు గురైన రమ్య ఐదు నెలల గర్భిణి కూడా. తాడ్వాయి ఎస్‌ఐ ఆంజనేయులు కేసు నమోదు చేశారు.
లాంఛనాల నిమిత్తం ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.