tv-arist-mahalakshmi-producer

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, సెప్టెంబర్1, 2022: ప్రముఖ నిర్మాత బుల్లితెర నటిని వివాహం చేసుకున్నారు. ప్రముఖ సినిమా ప్రొడ్యూసర్ ధయారిప్లార్ రవీందర్ చంద్రశేఖరన్, నటి మహాలక్ష్మి శంకర్ ఈ రోజు పెళ్లి చేసుకున్నారు. తమిళసినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలలో ఒకరైన లిప్రా ప్రొడక్షన్స్ రవీందర్ చంద్రశేఖరన్, ప్రముఖ టీవీ నటి మహాలక్ష్మి శంకర్‌ల వివాహం ఈ రోజు ఘనంగా జరిగింది.

తిరుపతిలో గురువారం ఉదయం11 గంటలకు వివాహ బంధంతో వీళ్లద్దరూ ఒక్కటయ్యారు. ఈ వేడుకకు రవీందర్ చంద్రశేఖరన్ ,మహాలక్ష్మి శంకర్ల కుటుంబసభ్యులు హాజరయ్యారు. సినిమా పరిశ్రమకు చెందిన వాళ్లు ,టెలివిజన్ రంగాలకు చెందిన నిర్మాతలు, డైరెక్టర్‌లు, నటులు, నటీమణులు, కళాకారులు హాజరై నూతన దంపతులైన రవీందర్ చంద్రశేఖరన్ ,మహాలక్ష్మి శంకరులను ఆశీర్వదించారు. మరికొంతమంది ఫోన్ ద్వారా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.

tv-arist-mahalakshmi-producer

నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ తన లిబ్రా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నట్పునా ఎన్నను థెరియుమా, మురుంగైకై చిప్స్ వంటి చిత్రాలను నిర్మించి దక్షిణాదిసినిమా పరిశ్రమలో తన విజయ పరంపరను కొనసాగిస్తున్నారు. రవీందర్ గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో నటి మహాలక్ష్మి పెళ్లి చేసుకున్న ఫోటోలను పంచుకున్నారు. సన్నిహిత కుటుంబ సభ్యులు స్నేహితుల సమక్షంలో ఉదయం 11 గంటలకు పెళ్లి చేసుకున్నామని ఆయన వెల్లడించారు.

మహాలక్ష్మి వాణి రాణి, ఆఫీస్, చెల్లమాయ్, ఉతిరిపూక్కల్, ఒరు కై ఒసై వంటి టెలివిజన్ సీరియల్స్ లో నటించారు. ఆమె తన పెళ్లి ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. “నువ్వు నా జీవితంలో ఉండటం నా అదృష్టం.. నీ ఆప్యాయతతో నా జీవితాన్ని నింపావు.. లవ్ యూ అమ్మూ” అంటూ క్యాప్షన్ పెట్టింది.

మహాలక్ష్మి వంటి మహిళ కావాలని అందరూ ఇష్టపడతారని, ఆ అవకాశం తనకు లభించడం తన అదృష్టమని రవీందర్ చంద్రశేఖరన్ అన్నారు. రవీందర్ చంద్రశేఖరన్ జీవితం తనకు తోడు దొరకడం చాలా సంతోషంగా ఉందని మహాలక్ష్మి శంకర్ తెలిపారు.