365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్, సెప్టెంబర్13, 2022: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2022 (SIIMA) ఈవెంట్ బెంగళూరులో రెండు రోజుల పాటు శని, ఆదివారాల్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ,శాండల్‌వుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. నటీనటులు తమ డిజైనర్ దుస్తులతో మెరిసిపోవడంతో ఈవెంట్ సందడితో నిండిపోయింది. అభిమానులందరికీ కనువిందు చేసిందిఈ కార్యక్రమం.
తెలుగు,కన్నడ చిత్రాల అవార్డు గ్రహీతలను సెప్టెంబర్ 10న ప్రకటించగా, తమిళం,మలయాళ పరిశ్రమల విజేతలనుసెప్టెంబర్ 11, 2022న ప్రకటించారు. టాలీవుడ్ విజేతలు: • ఉత్తమ చిత్రం – పుష్ప: ది రైజ్ • బెస్ట్ ప్రధాన పాత్రలో నటుడు-పుష్ప: అల్లు అర్జున్ • ప్రధాన పాత్రలో ఉత్తమ నటుడు (విమర్శకులు) – జాతి రత్నాలు కోసం నవీన్ పోలిశెటి.
![SIIMA-AWARDS_2022](http://365telugu.com/wp-content/uploads/2022/09/SIIMA-AWARDS_2022.jpg)
• ప్రధాన పాత్రలో ఉత్తమ నటి- మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ :పూజా హెగ్డే • సహాయ పాత్రలో ఉత్తమ నటుడు – పుష్ప: జగదీష్ ప్రతాప్ బండారి • సహాయ పాత్రలో ఉత్తమ నటి- క్రాక్: వరలక్ష్మి శరత్‌కుమార్ • కామెడీలో ఉత్తమ నటుడు- సుదర్శన్ ఏక్ మినీ కథ కోసం • ఉత్తమ దర్శకుడు – పుష్ప: సుకుమార్ • ఉత్తమ నూతన దర్శకుడు -ఉప్పెన కోసం బుచ్చి బాబు సనా
• ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – అఖండ కోసం సి. రాంప్రసాద్ • ఉత్తమ సంగీత దర్శకుడు – దేవి శ్రీ ప్రసాద్, పుష్ప: • ఉత్తమ తొలి నటి – ఉప్పెన కోసం కృతి శెట్టి • ఉత్తమ నేపథ్య గాయని-అఖండలోని జై బాలయ్య పాటకు గీతా మాధురి • ఉత్తమ నేపథ్య గాయకుడు-జాతి రత్నాలులోని చిట్టి పాటకు రామ్ మిరియాల • ఉత్తమ గేయ రచయిత – పుష్ప: శ్రీవల్లి పాట చంద్రబోస్.