Wed. Dec 25th, 2024
invite-YS-Jagan-for-Tirumal

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి,సెప్టెంబర్ 21,2022:ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని ఏపీ సీఎంకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆహ్వాన పత్రం అందజేశారు. బుధవారం అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి వైఎస్‌ జగన్‌ను కలిసి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని, రాష్ట్ర ప్రజల తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాలని కోరారు.

ఈ సందర్భంగా చైర్మన్ స్వామివారి ప్రసాదాలు, వస్త్రాలను సీఎంకు అందజేశారు. టిటిడి ఛైర్మన్‌తో పాటు టిటిడి కార్యనిర్వహణాధికారి ఎవి ధర్మారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

error: Content is protected !!