Mon. Dec 23rd, 2024
Amaravati march for politics: Minister Gudivada Amarnath

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి,సెప్టెంబర్ 24,2022: అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర రాజకీయ ప్రేరేపితమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అభివర్ణించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతు కూడగట్టేందుకు పాదయాత్రను నిర్వహిస్తున్నారని ఆరోపించారు.

Amaravati march for politics: Minister Gudivada Amarnath

అధికార వికేంద్రీకరణలో భాగంగా విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేయడంపై ప్రజాప్రతినిధులు, మేధావులు, రిటైర్డ్ వైస్ ఛాన్సలర్లు, ప్రొఫెసర్లు, లాయర్లు, డాక్టర్లతో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయించినట్లు అమర్‌నాథ్ తెలిపారు.

పాదయాత్రపై రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ.. బీజేపీ నేతలు సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు రియల్‌ ఎస్టేట్‌ కోసం అమరావతిలో భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. తమ వ్యక్తిగత ప్రయోజనాలను కాపాడుకునేందుకే పాదయాత్రకు మద్దతుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Amaravati march for politics: Minister Gudivada Amarnath

ఎన్టీఆర్‌ యూనివర్శిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ (ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్‌) పేరును వైఎస్‌ రాజశేఖరరెడ్డి (వైఎస్‌ఆర్‌) పేరు మార్చడంపై తన వైఖరి సీఎందేనని అమర్‌నాథ్‌ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

error: Content is protected !!