365తెలుగు డాట్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,అక్టోబర్1,2022:తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TS BIE) రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 2 నుండి 9 వరకు దసరా సెలవులు (మొదటి టర్మ్) ప్రకటించింది.

సెలవుల షెడ్యూల్‌ను కచ్చితంగా పాటించాలని అన్ని జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లను బోర్డు ఆదేశించింది. దసరా సెలవుల్లో ఎలాంటి తరగతులు నిర్వహించవద్దని ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, యాజమాన్యాలను ఆదేశించింది.
మొదటి టర్మ్ సెలవుల తర్వాత, కళాశాలలు అక్టోబర్ 10 న తిరిగి తెరుచుకోనున్నాయి.
సూచనల ఉల్లంఘనలు తీవ్రంగా పరిగణించబడతాయి, తప్పు చేసిన యాజమాన్యాలపై డిస్‌ఫిలియేషన్‌తో సహా చర్యలు ప్రారంభించబడతాయని బోర్డు తెలిపింది.
