365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్ ,అక్టోబర్ 4, 2022: తెలంగాణా రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాస రావు ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. విజయాలను అందించే విజయ దశమిగాజరుపుకునే దసరా రోజున పాలపిట్టను దర్శించి, జమ్మిచెట్టుకు పూజలు చేసి, జమ్మి ఆకును బంగారంలా భావిస్తూ ఒకరికొకరు ఇచ్చిపుచ్చు కుంటూ, పెద్దల ఆశీర్వాదాలను అందుకుంటూ, అలయ్ బలయ్ తీసుకొంటూ ప్రేమాభిమానాలను చాటుకుంటారని ఇది అనాదిగా వస్తున్న సంప్రదాయమని డాక్టర్ గడల శ్రీనివాస రావు అన్నారు

దశ హస్తాలతో…దశాయుధాలతో దర్శనమిస్తూ..అష్టాదశ సిద్ధులను అనుగ్రహించే అమ్మ అనుగ్రహంతో విజయదశమి సాక్షిగా విజయాలు జయ..జయధ్వానాలుగా తెలంగాణా ప్రజలందరి ఇంటి పేరుగా మారాలని మనసారా కోరుకుంటూ.. విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు డాక్టర్ గడల శ్రీనివాసరావు పేర్కొన్నారు.