Janasena-nagababu

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, విజయవాడ, అక్టోబర్18,2022: కుట్రపూరిత రాజకీయాలకు బలవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని పవన్ కళ్యాణ్ అన్నారు..ఈ రోజు సభా ముఖంగా నేను చెబుతున్నాను.. ఒకవేళ నాయకుడే బలి కావాల్సి వస్తే..అందరికంటే నేనే ముందుంటా అని, పవన్ కళ్యాణ్ ను తాకాలంటే ముందు నా శవం దాటాలని” జనసేనపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణిదెల నాగబాబు అన్నారు.

“వైసీపీ ప్రభుత్వం ఇంజూరియస్ టూ ఆంధ్రప్రదేశ్. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తోనే అభివృద్ధి సాధ్యంఅని, జనసేనఅధ్యక్షులు పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని, వేలాది మంది పోలీసులను అడ్డంపెట్టుకొని వేధించారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారిజాము వరకు నోవటెల్ హోటల్ లో గందరగోళం సృష్టించి మా పార్టీ నాయకులను అరెస్టు చేశారని నాగబాబు వెల్లడించారు.

Janasena-nagababu

ఐ.పి.సి. సెక్షన్ 307 కింద కేసులు నమోదు చేశారు. వైసీపీ నిర్వహించిన గర్జన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా దూషించడం వల్లే… భావోద్వేగంకు గురైన కార్యకర్తలు విమానాశ్రయంలో ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారని నాగబాబు అన్నారు.

వ్యక్తిగతంగా తిట్టడం వల్లే భావోద్వేగానికి గురైన కార్యకర్తలు ఎన్టీఆర్ భవన్ పై దాడులకు పాల్పడ్డారని జగన్ తన కార్యకర్తలను వెనకేసుకురావొచ్చు. ఏం మిగతా పార్టీ కార్యకర్తలకు భావోద్వేగాలు ఉండవా? ఒక్క వైసీపీ నాయకులకేనా భావోద్వేగాలు ఉండేది? నీతి, నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణ, మనవత్వం వంటి గొప్ప లక్షణాలతో ఏర్పడిన జనసేన పార్టీని మోస్తున్న కార్యకర్తలకు ఇంకా ఎక్కువ భావోద్వేగాలు ఉంటాయని నాగబాబు పేర్కొన్నారు.

Janasena-nagababu

పవన్ కళ్యాణ్ కార్యకర్తలను రెచ్చ గొడుతు న్నారని వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు..ఆయన నిజంగా రెచ్చగొడితే పరిస్థితి ఇలా ఉండదు. మరోలా ఉంటుంది. ఆయన వాళ్లను కంట్రోల్ చేస్తున్నారు కాబట్టే సంయమనం పాటిస్తున్నారు. వైసీపీ ముందస్తు ప్లాన్ లో భాగంగానే విమానాశ్రయం ఘటన జరిగింది తప్ప మరొకటి కాదని నాగబాబు వివరించారు.