365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్, షాద్‌నగర్, అక్టోబర్ 25,2022: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో పేరుమోసిన చెడ్డీ గ్యాంగ్‌ల కదలికలు వెలుగులోకి రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పరిగి రోడ్డులోని మై హోమ్ వెంచర్‌లోని ఓ ఇంట్లో చెడ్డీ గ్యాంగ్ సభ్యుల కదలికలు కనిపించినట్లు సమాచారం.

ఈ దృశ్యాలు ఆవరణలో అమర్చిన నిఘా కెమెరాల్లో రికార్డయ్యాయి. సీసీటీవీ ఫుటేజీలో నలుగురు చెడ్డీ గ్యాంగ్ సభ్యులు ఆయుధాలతో వెంచర్లో తిరుగుతున్నట్లు గుర్తించారు. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు.