365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్,హైదరాబాద్ ,నవంబర్18, 2022: పెట్రోల్ బంకుల్లో వాహనదారులను మోసంచేస్తున్నాయి పలు పెట్రోల్ ఓనర్స్. మోసాలకు పాల్పడుతూ ఏదొక చోట పట్టుబడుతూనే ఉన్నారు. మీటర్ పై వాహనదారులకు కరెక్ట్ గా చూపించినా, పెట్రోల్ మాత్రం తక్కువ వచ్చేలా పెట్రోల్ బంకుల్లో మోసాలు చేస్తున్నారు. తెలివిగా వాహనదారులను చీట్ చేస్తున్నారు కొందరు.
చిప్ ద్వారా అవకతవకలకు పాలపడుతూ వినియోగదారులను అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ మోసాలను గుర్తించిన ఎస్వోటీ పోలీసులు సైబరాబాద్ పరిధిలోని పలు బంకులపై దాడి చేసి పలు పెట్రోల్ బంక్ లను సీజ్ చేసారు.
శివరాంపల్లి ఇండియన్ ఆయిల్ కంపెనీకి చెందిన జీ వై ఎస్ రెడ్డి పెట్రోల్ బంక్ పై సోదాలు చేయగా పెట్రోల్, డీజీల్ మిషన్ లో సాఫ్ట్ వెర్ ఉపయోగించినచిప్ లు అమర్చి మోసాలకు పాల్పడుతున్నట్లు బయటపడింది.
చిప్ తో లీటర్ కు దాదాపు 10 రూపాయల మేర వాహనదారులను బంక్ యజమాని దోపిడీ చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ చీకటి దందా జరుగుతోందని తెలుస్తోంది. చిప్ లు అమర్చిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అతడిని విచారించగా నగరవ్యాప్తంగా పలు పెట్రోల్ బంక్ ల్లో చిప్స్ అమర్చినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. దొరికిన నిందితుడి సహాయంతో మోసాలకు పాల్పడుతున్న బంక్ ల పై అధికారులు దాడులు చేసారు.