AP-cs

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి, నవంబర్ 25,2022: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ శుక్రవారం కుటుంబ సమేతంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.

ఆలయ ముఖ ద్వారం వద్ద చేరుకున్న వీరికి టీటీడి జే ఈ ఓ వీరబ్రహ్మం, డిప్యూటీ ఈ ఓ లోకనాధం, ఏ ఈ ఓ ప్రభాకర్ రెడ్డి, తిరుపతి ఆర్డీఓ కనక నరస రెడ్డి సాంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

AP-cs

దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వ‌చ‌నం చేశారు. టిటిడి జేఈఓ వీరబ్రహ్మం ఈ సంద‌ర్భంగా సమీర్ శర్మ దంపతులకు అమ్మవారి తీర్థప్రసాదాలు, అంద‌జేశారు. అనంతరం అమ్మవారి బ్రహ్మోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.