pawan-_KALYAN-_ramayya

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి, నవంబర్ 27,2022: “అన్నమయ్య ప్రాజెక్టు పరిస్థితిని గమనించి వందలాది మందిని అప్రమత్తం చేసిన గొప్ప హీరో రామయ్య గారు, ఎంతో ఉన్నతంగా బతికిన రామయ్య గారి కుటుంబం నేడు దీనస్థితిలో ఉంది.

సినిమాల్లో చూసే హీరోల కంటే నిజ జీవితంలో రామయ్య గారి లాంటివారే గొప్ప హీరోలు, అన్నమయ్య ప్రాజెక్టు వరదలో మొత్తం పలు గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయని” జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు.

pawan-_KALYAN-_ramayya

“ఇప్పటికీ ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి సహాయం అందలేదు. యువతలో అద్భుతమైన ప్రతిభా పాటవాలు ఉన్నాయి. అన్నమయ్య ప్రాజెక్టు వరదల వల్ల వంశీ కృష్ణ లాంటి అద్భుతమైన యువత నష్ట పోయారు. జాతీయ ఛాంపియన్ అయిన వంశీ కృష్ణ కుటుంబానికి జనసేన పార్టీ మద్దతుదారులు అండగా ఉండాలని కోరుతున్నాను.

ఎన్నో పథకాలు సాధించిన వంశీకృష్ణ సొంత కాళ్ళ మీద నిలబడి మార్షల్ ఆర్ట్స్ లో రాణించేలా చూస్తాం” అని పవన్ అన్నారు. ఈ సందర్భంగా రామయ్యని సత్కరించి రూ. 2 లక్షలు, వంశీకృష్ణను సత్కరించి రూ. 50 వేల ఆర్థిక సహాయం పార్టీ తరఫు నుంచి పవన్ కళ్యాణ్ అందజేశారు.

ఇవీ కూడా చదవండి..

వైసీపీని ఉగ్రవాద సంస్థగానే చూచూస్తాం..:జనసేన పార్టీ ఛీఫ్
బెదిరించి ఎన్నికలను, ప్రజాస్వామ్యాన్నిఅపహస్యం చేశారు: జనసేన అధినేత
నన్ను ఇబ్బంది పెట్టిన వారెవరినీ మర్చిపోను: పవన్ కళ్యాణ్

”AP04 రామాపురం” సినిమా ట్రైలర్ రిలీజ్

20 రకాల ఇన్ఫ్లుఎంజా వైరస్ నుంచి రక్షించే వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు..

భవిష్యత్తులో పాల ధరలను పెంచే ఆలోచన లేదన్న అమూల్

‘ త్వరలో మరో మహమ్మారి.. పరిస్థితులు చాలా ఘోరం ఉండవచ్చు’

ఎన్‌డీటీవీ స్వాధీనంపై గౌతమ్ అదానీ కీలక వ్యాఖ్యలు

 చైనాలో మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు.. పలుచోట్ల లాక్ డౌన్..