365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢిల్లీ,డిసెంబర్1,2022: వాహన దారులకు గుడ్ న్యూస్..ఇంధన ధరలు మరింతగా దిగిరాను న్నాయి. ఎన్నడూలేని విధంగ పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గనున్నాయి. దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు 14 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంది. ముడి చమురు ధరలు తగ్గడమే దీనికి ప్రధాన కారణం.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు జనవరి నుంచి తగ్గను న్నాయి. ఇది ఇప్పుడు 81డాలర్లకు తగ్గింది, యూఎస్ క్రూడ్ బ్యారెల్‌కు 74డాలర్లకు దగ్గరగా ఉంది.పెట్రోలు, డీజిల్ ధరలు మే నుంచిమరింతగా తగ్గవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా, ముడి చమురు ధరలలో గణనీయమైన తగ్గుదల భారతీయ రిఫైనరీల సగటు ముడి చమురు ధర బ్యారెల్కు 82డాలర్లకు తగ్గించింది. మార్చిలో ఇది 112.8 డాలర్లుగా ఉంది. దీని ప్రకారం, 8 నెలల్లో, రిఫైనింగ్ కంపెనీలకు ముడి చమురు ధర 31 డాలర్లు (27%) తగ్గింది.
SMC గ్లోబల్ ప్రకారం దేశంలోని చమురు కంపెనీలు క్రూడ్ ఆయిల్ ను శుద్ధి చేయడానికి లీటరుకు 45 పైసలు ఆదా చేస్తాయి. దీని ప్రకారం పెట్రోల్-డీజిల్ ధరలో తగ్గింపు లీటరుకు రూ.14మేర ఉండొచ్చు. అయితే మొత్తం తగ్గింపు ఒకేసారి జరగదని మార్కెట్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.