365తెలుగుడాట్ కామ్ ఆన్లైన్ న్యూస్,హైదరాబాద్,డిసెంబర్1,2022: పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గురువారం డిజియాత్రను ప్రారంభించారు. పేపర్‌వర్క్ తోపనిలేకుండా దేశంలోని మూడు విమానాశ్ర యాలలో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా విమాన ప్రయాణీకులకు ప్రవేశాన్ని కల్పించనున్నారు.
డిజియాత్రతో, భద్రతా తనిఖీ ప్రాంతాలతో సహా వివిధ చెక్‌పోస్టుల వద్ద ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఆధారంగా ప్రయాణీకుల డేటా ఆటోమేటిక్ గా ప్రాసెస్ చేయడానికి వీలవుతుంది.

ఢిల్లీతో పాటు వారణాసి, బెంగళూరు విమానాశ్రయాల్లో గురువారం డిజియాత్ర ప్రారంభమైంది. మార్చి 2023 నాటికి హైదరాబాద్, కోల్‌కతా, పూణే,విజయవాడ విమానాశ్రయాల్లో ఫేషియల్ రికగ్నిషన్ బేస్డ్ ఎంట్రీ ప్రవేశపెట్టనున్నారు. ఆ తరువాత దేశంలోని అన్ని విమానాశ్రయాలలో ఈ సాంకేతికతను విస్తరించ నున్నారు.
బోర్డింగ్ పాస్‌తో లింక్ చేసే వారి గుర్తింపు కోసం ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ ను ఉపయోగించి పేపర్లెస్అండ్ కాంటాక్ట్‌లెస్ ప్రాసెసింగ్ ద్వారా ప్రయాణికులు విమానాశ్రయాలలోని వివిధ చెక్పాయింట్ల గుండా వెళ్లడానికి వీలవుతుంది. ఐడెంటిటీ తోపాటు, ప్రయాణ ఆధారాలు ప్రయాణీకుల స్మార్ట్‌ఫోన్‌లోనే సురక్షితమైన వాలెట్లో నిల్వ కానున్నాయి.
సేవను పొందడం కోసం, ఒక ప్రయాణీకుడు తమ వివరాలను ఆధార్ ఆధారిత ధ్రువీకరణ, సెల్ఫ్ ఇమేజ్ క్యాప్చర్‌ని ఉపయోగించి డిజియాత్ర యాప్‌లో నమోదు చేసుకోవాలి. తదుపరి దశలో, బోర్డింగ్ పాస్‌ను స్కాన్ చేయాలి. ఆధారాలను విమానాశ్రయంతో పంచుకోవాలి.

విమానాశ్రయం ఈ-గేట్ వద్ద, ప్రయాణీకుడు మొదట బార్ కోడెడ్ బోర్డింగ్ పాస్‌ను స్కాన్ చేయాలి.ఆ తర్వాత ఈ-గేట్ వద్ద ఇన్స్టాల్ చేసిన ముఖ గుర్తింపు వ్యవస్థ ప్రయాణీకుల గుర్తింపు, ప్రయాణ పత్రాన్ని ధృవీకరిస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, ప్రయాణీకుడు ఈ-గేట్ ద్వారా విమానాశ్రయం లోకి ప్రవేశించవచ్చు. ప్రయాణీకుడు భద్రతను క్లియర్ చేసి విమానం ఎక్కేందుకు సాధారణ విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది.
DigiYatra యాప్ బీటా వెర్షన్‌ను DIAL ఆగస్టు 15న ప్రారంభించింది. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (DIAL) దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (IGIA) నిర్వహిస్తోంది. ఇది దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయం కూడా. డిజి యాత్ర ఫౌండేషన్, లాభాపేక్ష లేని సంస్థ, డిజియాత్రకు నోడల్ బాడీ గా వ్యవహరించనుంది.

ఫౌండేషన్ వాటాదారులు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI), కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (CIAL), బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (BIAL), ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (DIAL), హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (HIAL),ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (MIAL) ).
ఇవి కూడా చదవండి..
చలికాలంలో నవజాత శిశువుల సంరక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
వాహనదారులకు గుడ్ న్యూస్..భారీగా తగ్గనున్న పెట్రోల్,డీజిల్ ధరలు.. ఎందుకంటే..?
కెఎస్.జవహర్ రెడ్డి ప్రొఫైల్..
శాంసంగ్ గెలాక్సీ A14, M54 5G, S23 సిరీస్ లాంచ్‌కు ముందే ఫీచర్స్ లీక్
డిసెంబర్10న డా.జి.సమరంతో దాంపత్య వికాసంపై నేషనల్ లెవల్ ట్రైనింగ్ క్యాంప్
ఇండియాలో మొట్టమొదటి అంతర్జాతీయ బౌద్ధ విశ్వవిద్యాలయం.. ఎక్కడంటే..?
ఫ్రీగా హిందూ పురాణాలకు సంబంధించిన పీడీఎఫ్ బుక్స్..
సమీర్ శర్మ కు సీఎం జగన్ కీలక బాధ్యతలు
వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం..విచారణ తెలంగాణకు బదిలీ
పిల్లల్లో మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..?
అమ్మకానికి మినరల్ వాటర్ కంపెనీ బిస్లరీ..కారణం ఇదే..
డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిస్తే..మళ్లీ డ్రైవింగ్ టెస్టు తప్పనిసరి..