Tue. Dec 17th, 2024
President-of-India

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,డిసెంబర్ 5, 2022: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ వారి ఆలయానికి చేరుకున్న వీరికి టీటీడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, టీటీడి ఈ.ఓ ధర్మారెడ్డి, సి వి ఎస్ ఓ నరసింహ కిషోర్ స్వాగతం పలికారు.

ముందుగా వారు వరాహ స్వామి వారిని దర్శించుకున్న అనంతరం శ్రీవారి ఆలయ ముఖ ద్వారం వద్ద చేరుకోగా ఆలయ ప్రధాన అర్చకులు రాష్ట్రపతి వారికి ఆలయ మర్యాదలతో ఇఫ్తేకాల్ స్వాగతం పలికారు.

President-of-India

ధ్వజ స్థంభం వద్ద మొక్కులు చెల్లించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొన్నారు. అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలకగా టీటీడి ఛైర్మన్ మరియు ఈ.ఓ శేష వస్త్రం తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్ర పటాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా రాష్ట్రపతి వెంట కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి, ఏపీ ఉప ముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, రాష్ట్ర పర్యాటక, క్రీడలు యువజన సాంస్కృతిక శాఖామంత్రి రోజా, దేవాదాయ, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనిల్ కుమార్ సింఘాల్, డా.రవిశంకర్ ఏపీ అదనపు డిజిపి శాంతి భద్రతలు మంగళగిరి, జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, తిరుపతి ఎస్పీ ఎస్. పరమేశ్వర్ రెడ్డి , చిత్తూరు ఎస్ పి నిషాంత్ కుమార్, మాజీ టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

యదార్థ ఘ‌ట‌నకు పాట రూపంలో జీవం పోసిన మానుకోట ప్రసాద్..
ఈరోజు స్టాక్ మార్కెట్ లో ఏ కంపెనీ షేర్స్ కొంటే మంచి లాభాలు పొందవచ్చు..?
ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఉచిత ఆరోగ్య శిబిరం..
Brown Bear opens its 19th outlet in Nanakramguda
నానక్‌రామ్‌గూడలో19వ అవుట్‌లెట్‌ను ప్రారంభించిన బ్రౌన్ బేర్
error: Content is protected !!