#IMDb

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ముంబై,డిసెంబర్ 7,2022: గ్లోబల్ సూపర్ స్టార్ ధనుష్ IMDb జాబితాలో అత్యంత ప్రజాదరణ పొందిన స్టార్స్ జాబితాలో మొదటి స్థానంలో ఉండగా, ఆలియా భట్ ,ఐశ్వర్యా రాయ్ బచ్చన్ తర్వాతి స్థానాల్లో నిలిచారు.

సినిమా, టీవీ ,సెలబ్రిటీ కంటెంట్ కోసం ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన అధికారిక మూలమైన IMDb, నేడు 2022లో అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ స్టార్స్ ను ప్రకటించింది.

IMDb దాని ఖచ్చితమైన టాప్ 10 జాబితాలను IMDb 200 మిలియన్ల కంటే ఎక్కువ ఉన్న నెలవారీ సందర్శకుల వాస్తవ పేజీ వీక్షణల ఆధారంగా నిర్ణయిస్తుంది. ది గ్రే మ్యాన్ ,తిరుచిత్రంబలం వంటి బహుభాషా చిత్రాల విజయవంతమైన విడుదలలతో అభిమానుల ఆసక్తిని పెంచి ధనుష్ ఈ సంవత్సరంలో అగ్రస్థానం పొందిన సెలబ్రిటీగా నిలిచారు.

IMDb ప్రకారం 2022లో మోస్ట్ పాపులర్ అయిన ఇండియన్ స్టార్స్

#IMDb
  1. ధనుష్
  2. అలియా భట్
  3. ఐశ్వర్య రాయ్ బచ్చన్
  4. రామ్ చరణ్ తేజ
  5. సమంతా రూత్ ప్రభు
  6. హృతిక్ రోషన్
  7. కియారా అద్వానీ
  8. జూనియర్ ఎన్.టి. రామారావు
  9. అల్లు అర్జున్
  10. యష్

2022లో IMDb టాప్ 10 అత్యంత జనాదరణ పొందిన భారతీయ తారల జాబితాలో స్థానం పొందిన తారలు 2022 అంతటా IMDb వీక్లీ ర్యాంకింగ్ చార్ట్‌లో స్థిరంగా అత్యధిక ర్యాంక్‌ పొందిన వారు. ఈ ర్యాంకింగ్‌లు IMDbకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200 మిలియన్ల కంటే ఎక్కువ నెలవారీ సందర్శకుల వాస్తవ పేజీ వీక్షణల ఆధారంగా ఉంటాయి.

“ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు భారతీయ సినిమా, వెబ్‌సిరీస్, తారల గురించి మరింత తెలుసుకోవడానికి IMDbపై ఆధారపడి ఉన్నారు. టాప్ 10 ప్రముఖ భారతీయ తారల జాబితా ప్రపంచ ప్రజాదరణను నిర్ణయించడానికి, కెరీర్ మైలురాళ్ళు, పురోగతి క్షణాలను గుర్తించడానికి బెంచ్‌మార్క్‌గా స్థిరపడింది” అని IMDb ఇండియా హెడ్, యామినీ పటోడియా తెలిపారు.

“వివిధ ప్రాంతాలలోని కళాకారులు ప్రపంచవ్యాప్తంగా వేడుకలు చేసుకుంటున్నారు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభకు నిదర్శనం. ధనుష్ వంటి నటులు గుర్తింపు పొంది, ర్యాన్ గోస్లింగ్ అండ్ క్రిస్ ఎవాన్స్ వంటి హాలీవుడ్ తారలతో జతకడుతుండగా,

జూనియర్ ఎన్. టి. రామారావు, రామ్ చరణ్ తేజ మహత్తర చిత్రం RRR వంటి చిత్రాలకు కూడా సాక్షులైయ్యాము. నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ సినిమాల్లోకి తిరిగి రావడం అభిమానుల నుంచే కాకుండా, విమర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలను అందుకుంది.

IMDbతో ప్రత్యేకంగా మాట్లాడుతూ, అలియా భట్ ఈ సంవత్సరం జాబితాలో తన పేరు చేర్చినందుకు తన ప్రశంసలను ఇలా పంచుకుంది, “ నాకు ఇంతవరకు సినిమాల్లో మరపురాని సంవత్సరం 2022- ఈ సంవత్సరం నా సినిమాలన్నిటికి ప్రేక్షకులు అందించిన ప్రేమకు నేను ఎప్పటికీ ధన్యవాదములు చెపుతున్నాను,

మన దేశంలోని అత్యుత్తమ చిత్రనిర్మాతలు, కళాకారులతో కలిసి పనిచేసినందుకు గౌరవంగా భావిస్తున్నాను. IMDb ప్రజల స్వరానికి నిజమైన నిదర్శనం ,నేను నటించినంత కాలం ప్రేక్షకులను అలరించగలనని ఆశిస్తున్నాను! ప్రేమతో మరోసారి ధన్యవాదాలు.”అని ఆమె పేర్కొన్నారు.

#IMDb

· ధనుష్ (నం. 1) 2022లో ఐదు టైటిల్స్‌లో కనిపించాడు; నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ ది గ్రే మ్యాన్, తమిళంలో మారన్, తిరుచిత్రంబలం, నానే వరువెన్ ,వాతి విడుదలయ్యాయి.
· ఎస్. ఎస్. రాజమౌళి, మహత్తర RRR (రైజ్ రోర్ రివోల్ట్) లో ప్రధాన తారాగణం—ఆలియా భట్ (నం. 2), రామ్ చరణ్ తేజ (నం. 4), జూనియర్ఎన్. టి. రామారావు (నం. 8)-అందరూ జాబితాలోకి ప్రవేశించారు.
· • గంగూబాయి కతియావాడికి నాయకత్వం వహించి, డార్లింగ్స్ (దీనిని ఆమె నెట్‌ఫ్లిక్స్ కోసం కూడా నిర్మించారు) లో నటించి, అలాగే గ్లోబల్ హిట్ బ్రహ్మాస్త్రా పార్ట్ వన్: శివలో ఇషా పాత్రను పోషించడం ద్వారా భట్ అభిమానులను ఆనందపరిచారు.

· • ఐశ్వర్య రాయ్ బచ్చన్ (నం. 3) పొన్నియన్ సెల్వన్: పార్ట్ -Iలో తన అద్భుతమైన నటనతో ఐదేళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లోకి రావడం వినోద అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసారు.
· • కియారా అద్వానీ (నం. 7) జగ్‌జగ్‌జీయో, భూల్‌భూలైయా- 2 అనే రెండు బ్లాక్‌బస్టర్ విడుదలలతో ప్రేక్షకులను ఆకర్షించింది.

ఈ సంవత్సరం IMDbలో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ తారల గురించి మరింత తెలుసుకోవడానికి, ఈ వీడియోని చూడండి: https://www.imdb.com/video/vi1945748761/ పూర్తి జాబితాను ఇక్కడ చదవండి: https://www.imdb.com/list/ls563964668/.\