365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల, 13 డిసెంబర్ 2022: తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో శ్రీ శ్రీనివాస విశ్వశాంతి హోమం మంగళవారం వైఖానస ఆగమక్తంగా ప్రారంభమైంది.
ఈ సందర్భంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, పంచగవ్యారాధన,
దీక్ష హోమాలు, మొదటిరోజు విష్ణు హోమం నిర్వహించారు. ఆ తరువాత యాగశాల వైదిక కార్యక్రమాలు, తీర్థప్రసాద వినియోగం చేశారు.

ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ కెఎస్ఎస్ అవధాని ఆధ్వర్యంలో మానవాళి శ్రేయస్సు కోరుతూ ఈ హోమం డిసెంబర్ 18 వరకు 21 మంది రుత్వికులు 7 హోమ గుండాలలో శ్రీ శ్రీనివాస విశ్వశాంతి హోమం నిర్వహించనున్నారు.