Fri. Nov 22nd, 2024
Zika-virus

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,14 డిసెంబర్ 2022: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జికా వైరస్ ఈడెస్ దోమల ద్వారా వ్యాపిస్తుంది. డెంగ్యూ, చికున్‌గున్యా, ఎల్లో ఫీవర్ వంటివి ఈ దోమల ద్వారా వ్యాపిస్తాయి.

జికా వైరస్ రక్త పరీక్ష లేదా ఇతర శరీర ద్రవ పరీక్షలను ఉపయోగించి గుర్తించవచ్చు. ప్రస్తుతం జికా వైరస్‌కు నిర్దిష్ట చికిత్స కానీ వ్యాక్సిన్ కానీ అందుబాటులో లేదు.

జికా వైరస్ లక్షణాలు ఏమిటి..?

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం, వ్యాధి సాధారణ లక్షణాలు ఎలా ఉంటాయంటే..? దద్దుర్లు, జ్వరం, కండ్లకలక, కండరాలు, కీళ్ల నొప్పులు, నీరసం, తలనొప్పి వంటివి ఉంటాయి.

దాదాపు 80 శాతం కేసులు ఎలాంటి లక్షణాలు లేకుండానే వ్యాధి వస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.

జికా వైరస్ సోకిన మెజారిటీ వ్యక్తులు ఈ లక్షణాలలో పెద్దగా కనిపించలేదట. లక్షణాలు సాధారణంగా 2-7 రోజులు మాత్రమే ఉంటాయట.

Zika-virus

ఎవరికి ఎక్కువ ప్రమాదం..?

గర్భిణీ తల్లి నుంచి కూడా పిండానికి ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉందట, దీని వలన శిశువుల మెదడుపై ప్రభావం చూపుతుందట. తద్వారా శిశువులో పలు లోపాలు తలెత్తవచ్చని అంటున్నారు డాక్టర్లు.

చికిత్స ఎలా..?

జికా వైరస్‌ కు నిర్దిష్ట చికిత్స లేదు. విశ్రాంతి తీసుకోవడం, హైడ్రేటెడ్ గా ఉండటం ఈ లక్షణాలను నివారించడంలో సహాయపడుతుంది.

టైలెనాల్ బ్రాండ్ పేరుతో ఓవర్-ది-కౌంటర్ (OTC) విక్రయించే ఎసిటమైనోఫెన్ జ్వరం, కీళ్ల నొప్పులకు ఉపయోగిస్తున్నారు. అదికూడా వైద్యుడిని సంప్రదించి మాత్రమే చికిత్స తీసుకోవాలి.

జికా వైరస్‌ సోకకుండా ఏం చేయాలి.. ?

Zika-virus

జికా వైరస్ వ్యాధికి టీకా, నిర్దిష్ట చికిత్స లేదు, కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దోమలు వృద్ధి చెందే చోట నిలిచిపోయిన నీటిని తొలగించాలి.

పెద్ద ,చిన్నా అనే తేడాల్లేకుండా దోమలు కుట్టకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి.

ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు సహా ప్రతి ఒక్కరూ దోమల బెడద నివారణకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

error: Content is protected !!