Thu. Nov 21st, 2024
kottu-satyanarayana

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి,డిసెంబర్14,2022: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న175 దేవాలయాలను 2023 జనవరి 31 లోపు పూర్తిస్థాయిలో కంప్యూటరీకరణ చేయాల్సిందిగా సంబంధిత సాప్ట్ వేర్ సంస్థ ను ఏపీడిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశించారు.

దీని ద్వారా పారదర్శకతతో పాటు అవినీతికి తావు లేకుండా భక్తులకు మెరుగైన సేవలు అందించవచ్చునన్నారు. ఇప్పటికే 16 దేవాలయాల్లో అందుబాటులో ఉన్న కంప్యూటరీకరణ సేవలు మంచి ఫలితాలు ఇస్తున్నాయన్నారు.

బుధవారం విజయవాడలోని జమ్మిదొడ్డి దేవదాయ శాఖ క్యాంప్ కార్యాలయంలో బుధవారం దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దేవాదాయశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి రాష్ట్రంలోని ప్రముఖ 16 దేవాలయాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలలో అవినీతికి తావు లేకుండా భక్తులకు మెరుగైన పరదర్శకతోకూడిన సేవలందించాలన్నారు.

kottu-satyanarayana

మేజర్ 16 ప్రధాన దేవాలయాల్లోనూ ఆన్లైన్ సిస్టమ్స్ పాటించాల్సిందిగా మరియు కొన్ని చోట్ల విద్యుత్ కు అంతరాయం లేకుండా యూపీఎస్ లు వాడవల్సిందిగా మంత్రి సూచించారు. తదుపరి సమావేశం నాటికి 175 దేవాలయాల్లోనూ కంప్యూటీకరణతో కూడిన ఆన్లైన్ సేవలను భక్తులకు అందించాలని మంత్రి ఆదేశించారు.

ధూప దీప నైవేద్యం పథకం…


నేటి సమావేశంలో 185 దేవాలయాలకు ధూపదీప నైవేద్యం పథకం మంజూరు ప్రతిపాదనలు వచ్చాయి. ఈ ప్రతిపాదనలను హెడ్ ఆఫీస్ నుంచి ఒక టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ ను పంపించి అవి ప్రోపర్ గా ఉన్నట్లయితే సబ్జెక్టు వెరిఫికేషన్ అప్రూవల్ ఇచ్చారన్నారు.

అదేవిధంగా టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టమ్ (TMS)(9&9 సాప్ట్ వేర్)మీద రాష్ట్రంలో ఉన్న దేవాలయాల ఈవోలందరికీ తప్పనిసరిగా ఈ సాఫ్ట్ వేర్ మీద పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలని మంత్రి చెప్పారు. ప్రతి దేవాలయాలయంలోను దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సిందిగా 9&9 సాప్ట్ వేర్ సంస్థ వారిని మంత్రి ఆదేశించారు.

వచ్చే ఏడాది జనవరి 31కల్లా 175 దేవాలయాల్లో కచ్చితంగా ఆన్లైన్ సిస్టమ్స్ పూర్తిస్థాయిగా అమలు చేయాల్సిందిగా మంత్రి ఆదేశించడమైంది.

ఫైనాన్షియల్ అకౌంటింగ్ సిస్టమ్స్..

kottu-satyanarayana

నేటి సమావేశంలో ఫైనాన్షియల్ అకౌంటింగ్ సిస్టమ్స్ నందు గల ఆదాయ, రాబడుల వివరాలను మంత్రి పరిశీలించడం జరిగింది. దీనిపై అందరూ ఈవోలకు పూర్తి అవగాహన తెచ్చుకోవాల్సిందిగా ఆదేశించ డమైంది. ఈ విషయమై తదుపరి సమీక్ష సమావేశం నాటికి కార్యనిర్వాహక అధికారులు స్వయంగా వివరించాల్సిందిగా మంత్రి ఆదేశించారు.

అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ప్రోటోకాల్ విభాగాన్ని అనుసరించుటకు తగిన మార్గదర్శకాలు జారీ చేయాల్సిందిగా కమిషనర్ వారిని మంత్రివర్యులు ఆదేశించడమైంది. దేవాలయాల్లో టెండర్లు ప్రాసెసింగ్ విధానం పారదర్శకంగా జరగాలన్నారు.

అన్నదానం,శానిటేషన్ సిబ్బందిని నియమించే విషయమై పారదర్శకత టెండర్ల విధానం ద్వారా మాత్రమే తీసుకోవాల్సిందిగా మంత్రి ఆదేశించారు.

ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ ఎం.హరి జవహర్ లాల్ అదనపు కమిషనర్ టి.చంద్రకుమార్, జాయింట్ కమిషనర్ ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్, దేవాదాయ శాఖ చీఫ్ ఇంజనీర్ ఎస్ శ్రీనివాస్,16 ప్రముఖ దేవాలయాల కార్యనిర్వహణ అధికారులు,9&9 సాప్ట్ వేర్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

error: Content is protected !!