Sun. Dec 22nd, 2024
whatsapp-pay

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై,డిసెంబర్ 15,2022:వాట్సాప్ పే ఇండియా హెడ్ వినయ్ చొలెట్టి తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో వెల్లడించాడు.

నవంబర్‌లో దాని కంట్రీ హెడ్ అజిత్ మోహన్ పదవీవిరమణ చేసిన ఆ తర్వాత భారతదేశంలోని మెటా నుంచి సుమారు ఒకనెలలోనే చొలేట్టి రాజీనామా చేశారు. దీంతో నాల్గవ హై-ప్రొఫైల్ ఉన్న వ్యక్తి మెటా నుంచి వైదొలిగారు.

whatsapp-pay

మోహన్ తర్వాత, వాట్సాప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్,మెటా ఇండియా పబ్లిక్ పాలసీ హెడ్ రాజీవ్ అగర్వాల్ కూడా గత నెలలో రాజీనామా చేశారు.

దీంతో నాల్గవ హై-ప్రొఫైల్ ఉన్న వ్యక్తి మెటా నుంచి వైదొలిగారు. మోహన్ తర్వాత, వాట్సాప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్,మెటా ఇండియా పబ్లిక్ పాలసీ హెడ్ రాజీవ్ అగర్వాల్ కూడా గత నెలలో రాజీనామా చేశారు.

లింక్డ్‌ఇన్‌లో వాట్సాప్ నుంచి నిష్క్రమించడం గురించి చోలేట్టి వినయ్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

“ఈరోజు వాట్సాప్ పేలో నా చివరి రోజు, నేను సైన్ ఆఫ్ చేస్తున్న, భారతదేశంలో వాట్సాప్, స్థాయి, ప్రభావాన్ని చూడటం ఒక వినయ పూర్వకమైన అనుభవం అని నేను గర్వంగా చెప్పగలను” అని చొలేట్టి అన్నారు.

అతను అక్టోబరు 2021లో అమెజాన్ నుంచి వాట్సాప్‌లో చేరి వాట్సాప్ పేకి నాయకత్వం వహించాడు.

error: Content is protected !!