Sun. Dec 22nd, 2024
Agni-5-missile

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, న్యూఢిల్లీ, డిసెంబర్ 15, 2022: అణ్వాయుధ సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5 గురువారం ఒడిశాలో విజయవంతంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

ఒడిశా తీరంలోని అబ్దుల్ కలామ్ ప్రయోగ కేంద్రం నుంచి గురువారం రాత్రి ఈ క్షిపణిని ప్రయోగించారు. నిర్దేశిత లక్ష్యాన్ని చేధించిందని అధికారులు తెలిపారు. ఇది అగ్ని-5 క్షిపణులకు సంబంధించి చేపట్టిన తొమ్మిదో ప్రయోగం.

Agni-5-missile

తొలిసారిగా దీన్ని 2012లో ప్రయోగించారు. ఈ క్షిపణిని కొత్త టెక్నాలజీ, కొత్త పరికరాలు ఉపయోగించి తయారు చేశారు.

ఈ క్షిపణి 5,400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని చేధించగలదు. భవిష్యత్తులో దీని సామర్ధ్యాన్ని మరింత పెంచేందుకు ఈ పరీక్ష ఉపయోగపడనుంది.

error: Content is protected !!