365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూఢిల్లీ, డిసెంబర్ 26, 2022:పదేళ్ల క్రితం జారీ చేసిన ఆధార్ కార్డ్ లను తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోని వాళ్లు అప్‌డేట్ చేసుకోవాలని ఎలక్ట్రానిక్స్ , ఐటీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
డేటాబేస్‌లోని సమాచార ఖచ్చితత్వం కోసం ప్రజలు తమ ఆధార్ కార్డులను అప్‌డేట్ చేయాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ప్రజలను కోరింది.
నివాసితులు సహాయక పత్రాలను (గుర్తింపు రుజువు , చిరునామా రుజువు) ఆన్‌లైన్‌లో myAadhaar పోర్టల్ ద్వారా లేదా ఆఫ్‌లైన్‌లో సమీపంలోని ఆధార్ కేంద్రాల్లో తమ ఆధార్ కార్డులను అప్‌డేట్ చేసుకోవచ్చని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది.
గత దశాబ్దంలో ఆధార్ సంఖ్య భారతదేశంలోని నివాసితుల గుర్తింపునకు విశ్వవ్యాప్తంగా ఆమోదించిన రుజువుగా మారింది.
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 319పథకాలుసహా1,100 కార్యక్రమాల కుపైగా ప్రభుత్వ సేవలను పొందడం కోసం ఆధార్ ఆధారిత గుర్తింపును ఉపయోగిస్తారు.
అంతేకాదు బ్యాంకులు, ఎన్ బీ ఎఫ్ సీలు వంటి అనేక ఆర్థిక సంస్థలు, వినియోగదారులను సజావుగా ప్రామాణీకరించడానికి, ఆన్‌బోర్డ్ చేయడానికి ఆధార్‌ను ఉపయోగిస్తాయి.
“ప్రస్తుత గుర్తింపు రుజువు ,చిరునామా రుజువుతో వారి ఆధార్ కార్డులను అప్‌డేట్ చేయడం నివాసితులకు ప్రయోజనకరంగా ఉంటుంది” అని యూఐడీఏఐ పేర్కొంది.
“ఆధార్‌లోని డాక్యుమెంట్‌లను అప్‌డేట్ చేయడం వలన జీవన సౌలభ్యం, మెరుగైన సర్వీస్ డెలివరీ, ఖచ్చితమైన ప్రమాణీకరణను అనుమతిస్తుంది.
యూఐడీఏఐ ఎల్లప్పుడూ నివాసితులను వారి పత్రాలను అప్‌డేట్ చేయమని ప్రోత్సహిస్తుంది. ఆధార్ (ఎన్రోల్‌మెంట్ అండ్ అప్‌డేట్) 10వ సవరణ నిబంధనలు 2022 నవంబర్‌లో తెలియజేశారు.