AP_Dgp_

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అమరావతి, డిసెంబర్ 28, 2022: మెరుగైన పోలీపింగ్ తో నేరాల తగ్గించగలిగామని ఏపీ డీజీపి రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఆయన మీడియా సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నేరాల వివరాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విజబుల్ పోలీసింగ్, అవగాహన కార్యక్రమాలను చేపట్టడం, మహిళా పోలీసు సేవల సమర్థవంత నిర్వహణ, పీడి యాక్ట్ ప్రయోగం, నాటు సారా ఫై ఉక్కుపాదం మోపడం తదితర చర్యల వల్ల నేరాలు తగ్గుముఖం పట్టాయి అన్నారు.

AP_Dgp_

నేరాల వివరాలు ఏపీ డీజీపి రాజేంద్రనాథ్ రెడ్డి మాటల్లోనే….

గతేడాది 2,84,753 కేసులు నమోదు కాగా, 2022లో 2,31,359 కేసులు మాత్రమే నమోదయ్యాయి. 2021 లో 945 హత్య కేసులు నమోదు కాగా, 2022లో 857 హత్య కేసులు మాత్రమే నమోదయ్యాయి.

చోరీల్లో నేరస్తులను గుర్తించడం, మరియ రికవరీ శాతం బాగా పెరిగాయి. రోడ్డు ప్రమాదాలు 2021 లో 19203 జరుగగా 2022 లో 18739 ప్రమాదాలు జరిగాయి.

బ్లాక్ స్పాట్ లను గుర్తించి నివారణా చర్యలు చేపట్ఠాం. లోక్ అదాలత్ తో పెద్ద ఎత్తున కేసుల పరిష్కారిస్తున్నాం.

చిన్నపాటి వివాదాలు, మనస్పర్ధల కారణంగా వివాదాల్లో ఉన్న కేసులలో ఇరువర్గాలను పిలిపించి రాజీ కుదిర్చాం. లోక్ అదాలత్ ద్వారా 1,08,763 కేసులు పరిష్కారం చేశాం.

66% కేసుల్లో కన్నిన్షన్ చేయించగలిగాం. కన్విక్షన్ బేస్ పోలింగ్ విధానాన్ని ఈ సంవత్సరం జూన్ నుండి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నాము.

ఈ విధానం ద్వారా ప్రతి ఒక్క యూనిట్ అధికారి సిపి,ఎస్పీ తమ పరిధిలోని అత్యంత ముఖ్యమైన ఐదు కేసులు(మహిళలకు సంభందించిన కేసులకు మొదటి ప్రాధాన్యత) పర్యవేక్షణ చేస్తారు

AP_Dgp_

ప్రతిరోజు షెడ్యూల్ మేరకు కోర్టులో జరుగుతున్న కేసు ట్రైల్ పురోగతిపై సమీక్ష నిర్వహించే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేశాం.

ఈ విధానం ద్వారా కేసు ట్రైల్ సమయాన్ని తగ్గించి స్వల్పకాల వ్యవధిలోనే నేరస్తులకు శిక్ష పడేవిధంగా చేయొచ్చు.

అంతేకాకుండా ఏ ఒక్క నేరస్థుడు తప్పించుకోకుండా చూడటం ముఖ్య ఉద్దేశం అని ఏపీ డీజీపి రాజేంద్రనాధ్ రెడ్డి పేరొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

స్పెషల్ టూర్ ప్యాకేజీ తో “సింగ‌రేణి ద‌ర్శ‌న్” ను ప్రారంభించిన టీఎస్‌ఆర్టీసీ

సినిమా కష్టాల్లో..డ్రైవర్లు,రైడర్లు.. ఇండియా రేటింగ్స్ నివేదికలో వెల్లడి..

దుర్గగుడి అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ : ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ
2022 సంవత్సరంలో బాగా పాపులర్ ఐన యోగా ట్రెండ్స్..ఇవే..!

ఇంద్రకీలాద్రి దేవస్దానము క్యాలండర్-2023 ఆవిష్కరించిన మంత్రి కొట్టు సత్యనారాయణ..

మహిళను అతికిరాతకంగా చంపిన బస్ కండక్టర్..

అందరికీ సమానహక్కులు..సమాన గౌరవం రావాలి : మంత్రి నిరంజన్‌ రెడ్డి

రంగ నాథస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తలసాని శ్రీనివాస్ ..
బాలికల విద్యకు పెద్దపీట వేసిన తెలంగాణ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
తెలంగాణ రాష్ట్ర వైద్య విద్య చరిత్రలో సరికొత్త రికార్డు..
శ్రీశైలం మల్లన్న సేవలో భారత రాష్ట్రపతి ముర్ము..
ఎలుకల మూలకణాలను ఉపయోగించి మొదటి “సింథటిక్ ఎంబైరోస్” ను అభివృద్ధి చేసిన పరిశోధకులు

బ్రేకింగ్ న్యూస్ ..నేడు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. 

 ‘యువగళం’ పేరుతో నారా లోకేశ్‌ 4వేల కి.మీ పాదయాత్ర