Bengal minister Subrata Saha

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,బెంగాల్ ,డిసెంబర్ 29,2022: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మంత్రి సుబ్రతా సాహా గురువారం గుండెపోటుతో ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయసు 72.

తీవ్రమైన ఛాతి నొప్పి రావడంతో గురువారం ఉదయం ముర్షిదాబాద్ హాస్పిటల్‌ కు తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

మంత్రిని క్రిటికల్ కేర్ యూనిట్‌లో చికిత్స అందించి వైద్యులు పలు ప్రయత్నాలు చేసినా.. ఫలించలేదు, దీంతో ఉదయం 11 గంటల సమయంలో మరణించారు.

సాహా ముర్షిదాబాద్ జిల్లాలోని సాగర్‌డిఘి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడుసార్లు తృణమూల్ కాంగ్రెస్ శాసనసభ్యుడు, 2011, 2016 ,2019లో వరుస విజయాలను సాధించారు.

కాంగ్రెస్ కంచుకోటగా పరిగణించబడుతున్న మొత్తం ముర్షిదాబాద్ జిల్లా నుంచి ఎన్నికైన మొదటి తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే.

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన కార్యాలయం నుంచి విడుదల చేసిన ఒక ప్రకటనలో, సాహా మృతికి సంతాపం ప్రకటించారు.

“మంత్రి మరణం పట్ల నేను చాలా బాధపడ్డాను. చురుకైన రాజకీయ జీవితాన్ని కొనసాగించడమే కాకుండా, అతను అనేక సామాజిక సంక్షేమ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.

Source From Twitter

Bengal minister Subrata Saha

ఆయన చాలా స్నేహపూర్వకంగా ఉండేవారు. రాజకీయాలు, సామాజిక సేవలో ఆయన చేసిన కృషికి చాలా గొప్పది. ఆయన ఎప్పటికీ ప్రజలమనస్సులో చిరస్థాయిగా గుర్తుండిపోతారు.

రాష్ట్ర రాజకీయాల్లో ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేనిది. ఆయన కుటుంబ సభ్యులకు, అనుచరులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’అని ముఖ్య మంత్రి మమతా బెనర్జీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.