365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఢిల్లీ, జనవరి2, 2023: కరోనా కేసులు పెరగడంతో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. చైనా నుంచి అమెరికా వచ్చే ప్రయాణీకులు కరోనా రిపోర్ట్ చూపించవలసి ఉంటుందని అక్కడి ప్రభుత్వం కొత్త నిబంధనలను అమలు చేస్తోంది.
జనవరి 5 నుంచి చైనా నుంచి అంతర్జాతీయ ప్రయాణికులు యుఎస్‌లోకి ప్రవేశించే ముందు COVID-19 పరీక్షను చూపించవలసి ఉంటుందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) తెలిపింది.
చైనాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) చైనాతో పాటు హాంకాంగ్, మకావు నుంచి అమెరికా వచ్చే ప్రయాణికులందరికీ కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరి అని ప్రకటించింది. ఈ విషయాన్ని అమెరికా మీడియా ఆదివారం వెల్లడించింది.
చైనాలో COVID-19 కేసుల పెరుగుదల నేపథ్యంలో యూఎస్ లో COVID-19 వ్యాప్తిని అరికట్టడానికి సీడీసీ ఈ నిబంధనలను ప్రకటిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.

ఒక డేటా సంస్థ ప్రకారం చైనాలో కోవిడ్ కారణంగా రోజుకు తొమ్మిది వేల మంది మరనిస్తున్నారు. బ్రిటీష్‌కు చెందిన పరిశోధనా సంస్థ ఎయిర్‌ఫినిటీ ఇన్‌ఫెక్షన్ కేసుల సంఖ్య పెరగడంతో చైనాలో కోవిడ్ మరణాల సంఖ్య రెట్టింపు అయిందని నివేదిక పేర్కొంది.
నవంబర్‌లో జీరో కోవిడ్ విధానాన్ని తొలగించిన తర్వాత కోవిడ్ కేసుల సంఖ్య పెరిగింది. జీరో కోవిడ్ విధానం ఏళ్ల తరబడి అమలులో ఉంది.
ఇటలీ అధికారులు బుధవారం కూడా ఈ విషయాన్ని చెప్పారు. చైనా నుంచి మిలన్ (ఇటలీలోని నగరం)కి రెండు విమానాలలో దాదాపు సగం మంది ప్రయాణికులకు కోవిడ్‌కు పాజిటివ్ వచ్చింది. అందుకోసమే అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది.