365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుమల, జనవరి 2,2023: ఈ రోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని వైకుంఠ ద్వార దర్శనం గుండా ప్రముఖులు దర్శించుకున్నారు.
స్వామివారిని దర్శించుకున్న వారిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండెతోపాటు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, సీని నటుడు రాజేంద్ర ప్రసాద్, ఏపి మంత్రులు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,ఉషా శ్రీ చరణ్, తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ లు ఉన్నారు.
https://www.youtube.com/shorts/TBPEkKvCOkg
వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న వైష్ణవ ఆలయాల్లో స్వామివారు ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిచ్చారు.
నెల్లూరు జిల్లాలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఉత్తరద్వారం ద్వారా దర్శనమిస్తున్న శ్రీరంగనాథుడు.
తెల్లవారుజాము నుంచే భక్తులతో వైష్ణవాలయాలు కిటకిటలాడుతున్నాయి. నెల్లూరు నగరంలో వేంచేసి ఉన్న ఉత్తర శ్రీరంగంగా పేరొందిన తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
https://www.youtube.com/shorts/TBPEkKvCOkg
తిరుమలలో అర్ధరాత్రి నుంచే వైకుంఠ ద్వార దర్శనం కోసం క్యూలైన్ లలో వేచి ఉన్నారు భక్తులు. దేవస్థాన నిర్వాహకులు వైకుంఠ ద్వార దర్శనం తొలి దర్శనానికి కొంతమంది భక్తులను మాత్రమే అనుమతించారు.